Corona Third Wave: మూడవ వేవ్ కచ్చితంగా వస్తుంది.. సెకండ్ వేవ్ కంటే, మూడో వేవ్ ప్రమాదం తక్కువే..!

కరోనా మహమ్మారి మూడవ వేవ్ రావడం దాదాపు ఖాయం అంటున్నారు నిపుణులు. వచ్చే వారం(ఆగస్ట్ రెండోవారం) నుండి కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రారంభించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Corona Third Wave: మూడవ వేవ్ కచ్చితంగా వస్తుంది.. సెకండ్ వేవ్ కంటే, మూడో వేవ్ ప్రమాదం తక్కువే..!

India Corona

Corona Third Wave: కరోనా మహమ్మారి మూడవ వేవ్ రావడం దాదాపు ఖాయం అంటున్నారు నిపుణులు. వచ్చే వారం(ఆగస్ట్ రెండోవారం) నుండి కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రారంభించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ, సెకండ్ వేవ్ లాగా, మూడో వేవ్ మాత్రం పెద్ద విపత్తు అయ్యే అవకాశం లేదని, కరోనా పీక్ స్టేజ్‌ పరిస్థితుల్లో కూడా, రెండవ వేవ్‌తో పోలిస్తే ప్రతిరోజూ నాలుగింట ఒక వంతు కేసులు మాత్రమే నమోదవుతాయని IIT కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ మరియు అతని బృందం వెల్లడించింది. సెకండ్ వేవ్ ముప్పు గురించి ఖచ్చితమైన అంచనాలు ఉన్నాయని వారు వివరించారు.

అక్టోబర్‌లో శిఖరం:
కాన్పూర్‌లోని అగర్వాల్ మరియు ఐఐటి హైదరాబాద్‌లోని ఎం. విద్యాసాగర్ నేతృత్వంలోని పరిశోధకుల ప్రకారం, అక్టోబర్‌లో మూడవ తరంగంలో అంటువ్యాధి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. ఈ సమయంలో, ఒక లక్ష కంటే తక్కువ కేసులు సాధారణ స్థితిలోనూ.. పీక్ స్టేజ్‌లో ప్రతిరోజూ 1.5 లక్షల వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రెండవ వేవ్‌లో కరోనా గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు, మే 7న నాలుగు లక్షలకు పైగా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పాజిటివ్ రేట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా అటువంటి పరిస్థితులు రాలేదని, మరో వారం రోజుల్లో కరోనా తీవ్రంగా అవ్వొచ్చని వారు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ రెండు డోసులను వేగవంతం చేయడం, అభివృద్ధి చెందుతున్న హాట్‌స్పాట్‌లను ముందుగా గుర్తించడంపై దృష్టి పెడితే ప్రమాదం త్వరగా అంచనా వెయ్యొచ్చని చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కరోనా వైరస్ కొత్త వేరియంట్‌లను పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. ఎందుకంటే డెల్టా వంటి కొత్త వేరియంట్ వస్తే, రెండవ వేవ్‌లో కనిపించే విధంగా పరిస్థితి దిగజారిపోతుంది. అందుకే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వాలు, ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే?
కరోనా సంక్రమణ కేసులు బలహీనపడి సామాజిక మరియు వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించడంతో ప్రజల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి మొదటి వేవ్ ప్రభావాలు ముగిసిన వెంటనే ఇదే వైఖరి గమనించారని, ఆ తర్వాత సెకండ్ వేవ్ ఎటువంటి విధ్వంసానికి కారణమైందో చూశామని, ఇప్పుడు కూడా ప్రజలు, ప్రభుత్వాలు అదే వైఖరి ప్రదర్శిస్తే ప్రమాదంలో సమాజం పడుతుందని చెబుతున్నారు.

జాగ్రత్తగా ఉండటం ద్వారానే మూడవ వేవ్ నివారించవచ్చు
మణింద్ర అగర్వాల్ మరియు అతని బృందం గణిత నమూనా సూత్రం ఆధారంగా కనుగొన్న అంచనాల ప్రకారం.. సామాజిక మరియు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ, ప్రజలు కరోనా నియమాలను పాటిస్తే, మాస్కులు ధరించి మరియు భౌతిక దూరాన్ని పాటిస్తూ, అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు వస్తే, ఈ నెలాఖరులోపు కొత్త కేసులను 25వేలకు తగ్గించవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 41 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇవి ఆగస్ట్ రెండోవారం తర్వాత తగ్గినట్లైతే, కరోనా మూడో వేవ్ నుంచి తప్పించుకున్నట్లే. ప్రస్తుతం 40వేల కేసుల వద్ద నెల నుంచి తటస్థంగా ఉన్నాయి.