Covid : నదుల్లో కరోనా డెడ్ బాడీస్..డోంట్ వర్రీ అంటున్న ప్రొఫెసర్

Covid : నదుల్లో కరోనా డెడ్ బాడీస్..డోంట్ వర్రీ అంటున్న ప్రొఫెసర్

Ganga

Ganga River : భారతదేశంలో ఓ వైపు కరోనాతో జనాలు అల్లాడుతుంటే..మరోవైపు..ఈ వైరస్ బారిన పడిన మృతదేహాలు కొట్టుకొస్తుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా కాటుకు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది ఈ మహమ్మారి. కనీసం మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు కూడా శ్మశానాల్లో స్థలాలు దొరక్కని దుస్థితి నెలకొంది.

ఈ క్రమంలో..ఉత్తరాదిన గంగా, యమున నదుల్లో నీటిపై శవాలు తేలుతున్న ఘటనలు ఆందోళన రేకేత్తిస్తోంది. అసలే..కరోనాతో మృతి చెందిన మృతదేహాలు..అందులో నీటిలో తేలాడుతున్నాయి. దీంతో..నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా ? అనే తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ నదులను ప్రజలు పుణ్య నదులుగా భావిస్తుంటారు.

కరోనా మృతదేహాలను నీటిలో పడేయడం వల్ల, ..ఈ నీటిని తాగితే..కరోనా సోకుతుందనే ఆందోళన అక్కర్లేదని అంటున్నారు ఐఐటీ కాన్పూర్ కు చెందిన పర్యావరణ ప్రొఫెసర్ సతీశ్ టారె. నదీ జలాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే..ప్రజా అవసరాలకు సరఫరా చేస్తుంటారని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతేగాకుండా…శుద్ధి చేసే ప్రక్రియలో వైరస్ చనిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే..నదుల్లోని నీటిని తాగే వారు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ సూచిస్తున్నారు.

Read More : Weight Management: మీ బరువు అదుపులో ఉండాలా?.. అయితే ఈ సూపర్ ఫుడ్ తినాలి!