Covid Vaccination: 15-18 ఏళ్లవారికి CoWIN రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 15ఏళ్ల నుంచి 18ఏళ్ల మధ్య వయస్సు వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Covid Vaccination: 15-18 ఏళ్లవారికి CoWIN రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

Covid Vaccination Cowin Registrations For 15 18 Age Group Begins Today

Covid Vaccination: దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 15ఏళ్ల నుంచి 18ఏళ్ల మధ్య వయస్సు వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 1, 2022 (శనివారం) నుంచి టీకా కోసం CoWIN రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. CoWIN పోర్టల్‌లో 15-18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేసేందుకు రిజిస్ట్రేషన్లు శనివారం నుంచి ప్రారంభమవుతాయని క్రిస్మస్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.. అర్హత ఉన్న పౌరులందరికీ COVID వ్యాక్సినేషన్‌ అందించనున్నట్టు తెలిపింది. అలాగే 15-18 ఏళ్ల పిల్లలకు #CoWINలో రిజిస్ట్రేషన్లు జనవరి 1, 2022 నుంచి ప్రారంభముతాయని #LargestVaccineDrive #Unite2FightCorona” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని డిసెంబర్ 25, 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముందు జాగ్రత్తగా మూడో డోస్‌ను జనవరి 10, 2022 నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు. 15-18 ఏళ్ల వయస్సు జనాభా కేటగిరీలో ‘కోవాక్సిన్’ మాత్రమే అందించనున్నారు. అన్ని రాష్ట్రాలకు ‘కోవాక్సిన్’ అదనపు డోసులను పంపుతామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు/యుటిలకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు ‘కోవాక్సిన్’ సరఫరా చేయనుంది. జనవరి 1, 2022 నుంచి ముందుగానే కో-విన్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపింది. జనవరి 3 నుంచి టీకా Walk-in రిజిస్ట్రేషన్‌ పొందవచ్చు. 2007 లేదా అంతకుముందు పుట్టిన వారు మాత్రమే ఈ కేటగిరీ కింద టీకాలు అందుకోవడానికి అర్హులుగా పేర్కొంది. 15-18 ఏళ్ల వయస్సు గల వారికి టీకాలకు సంబంధించి అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించాల్సిందిగా సూచనలు చేసింది. టీకా వేయించుకున్న వారు అరగంట వరకు వేచి ఉండాలని సూచిస్తోంది. 28 రోజుల తర్వాత మాత్రమే రెండవ డోసు అర్హులుగా పేర్కొంది.

15-18 ఏళ్లవారికి టీకాలు వేసేందుకుగానూ కొన్ని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లను (CVC) ప్రత్యేకంగా నియమించే అవకాశం ఉందని రాష్ట్రాలకు కేంద్రం తెలిపింది. Co-WIN పోర్టల్ కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ నిర్వహణలో ఎలాంటి గందరగోళం లేకుండా స్పెషల్ CVCలను కేటాయించనున్నారు. 15-18 ఏళ్ల వయస్సు గల వారికి ప్రత్యేక క్యూలు, ప్రత్యేక టీకా బృందాలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ నిర్వహణలో భాగంగా గందరగోళాన్ని నివారించేందుకు ఒకే CVCలో రెండు వేర్వేరు టీకా బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. పెద్దలందరికీ ఒక సీవీసీ.. 15-18 ఏళ్ల వయస్సు వారికి మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ప్రీకాషన్ డోస్ తీసుకోవాలంటే.. రెండవ డోస్‌ను తీసుకున్నప్పటి నుంచి 9 నెలలు (39 వారాలు) పూర్తికావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.

Read Also :  ఇజ్రాయెల్ లో కొత్తరకం కరోనా వేరియంట్ ఫ్లోరోనా