8న అన్ని జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్

8న అన్ని జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్

COVID vaccination: India to conduct second dry run in all districts on January 8 దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి-8న మరోసారి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రస్ నిర్వహించేందుకు భారత్ సిద్దమైంది. కాగా,దేశ వ్యాప్తంగా జనవరి-13నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దమైనట్లు మంగళవారం కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ముందుగా మరోసారి డ్రై రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు.

వ్యాక్సినేషన్ డ్రై రన్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. దేశంలో అత్యవపర వినియోగానికి కరోనా వ్యాక్సిన్లు అనుమతిపొందిన రోజు నుంచి 10 రోజుల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రవేశపెట్టనున్నట్లు భూషణ్ తెలిపారు. అయితే ఫైనల్ నిర్ణయం ప్రభుత్వానిదే అని ఆయన సృష్టం చేశారు. కాగా,ఆక్స్ ఫర్డ్ తో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్,భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తోన్న కోవాగ్జిన్ వ్యాక్సిన్లను దేశంలో అత్యవసర వినియోగానికి ఆదివారం డీసీజీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

కాగా,శనివారం(జనవరి-4,2021)దాదాపు అన్ని రాష్ట్రాల్లో,కేంద్రపాలితప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకుముందు డిసెంబర్ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా, రాజ్‌కోట్, లూధియానా, గాంధీనగర్, పంజాబ్‌లోని షాహీద్ భగత్ సింగ్ నగర్, అస్సాంలోని సోనిత్‌పూర్, నల్బరి జిల్లాల్లో మొదటి డ్రై రన్ నిర్వహించారు.