Covid Vaccine : గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ నాటికి పిల్లలకు కరోనా వ్యాక్సిన్

ప్రస్తుతం అందరికి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. కోవిడ్ మూడో దశ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Covid Vaccine : గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ నాటికి పిల్లలకు కరోనా వ్యాక్సిన్

Covid Vaccine For Children

Covid Vaccine For Children : ప్రస్తుతం అందరికి కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. కోవిడ్ మూడో దశ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే వార్తలు మరింత భయపెడుతున్నాయి. ఈ క్రమంలో పిల్లలను కాపాడుకోవడం కోసం వ్యాక్సిన్ ను తొందరగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ముమ్మరంగా పరిశోధనలు సైతం జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఐసీఎంఆర్ ఎన్ఐవీ(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) పుణె డైరెక్టర్ ప్రియా అబ్రహం గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ నాటికి దేశంలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 2 నుంచి 18ఏళ్ల పిల్లల కోసం కోవాగ్జిన్ తయారు చేసిన టీకా ట్రయల్స్ లో ఉందన్నారు. ఫేస్-2, ఫేస్ 3 ట్రయల్స్ నడుస్తున్నాయన్నారు.

ట్రయల్స్ ఫలితాలు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. ఆ ఫలితాలను రెగులేటర్లకు ఇస్తాము. దాంతో సెప్టెంబర్ నెల నాటికి లేదా ఆ తర్వాత పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని ప్రియా అబ్రహం చెప్పారు.

ఐసీఎంఆర్, హైదరాబాద్ బేస్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశాయి. మన దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కోవాగ్జిన్ ఒకటి. మిగతా రెండు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చెందిన కొవిషీల్డ్, మరొకటి రష్యాకి చెందిన స్పుత్నిక్-వి.

డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మన దేశంలో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి జనవరిలో అనుమతి ఇచ్చింది. జైడస్ క్యాడిలా కూడా పిల్లల కోసం జైకోవ్ -డి టీకా అభివృద్ధి చేసింది. ఈ టీకాకు ఆమోదం లభించాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే అందుబాటులోకి రానుంది. కాగా, అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ జైడస్ క్యాడిలా అప్లికేషన్ పెట్టుకుంది. అది ఇంకా పెండింగ్ లో ఉంది.

”జైడస్ కాడిలా వ్యాక్సిన్ ట్రయల్ కూడా జరుగుతోంది. ఇది పిల్లలకు కూడా వర్తింపజేయబడుతుంది. అందుబాటులో ఉంచబడుతుంది “అని ప్రియా అబ్రహం చెప్పారు. విదేశాలలో బూస్టర్ మోతాదుపై అధ్యయనాలు జరుగుతున్నాయని, దాని కోసం కనీసం ఏడు వేర్వేరు వ్యాక్సిన్లను ప్రయత్నించామని తెలిపారు. “ఇప్పుడు, WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) మరిన్ని దేశాలు టీకాలు వేసే వరకు దానిని నిలిపివేసింది. అధిక ఆదాయం, తక్కువ ఆదాయ దేశాల మధ్య భయంకరమైన టీకా అంతరం ఉన్నందున ఇది జరుగుతోంది. కానీ, భవిష్యత్తులో, బూస్టర్‌ల కోసం సిఫార్సులు ఖచ్చితంగా వస్తాయని ప్రియా అబ్రహం అన్నారు.

వివిధ కోవిడ్ -19 వ్యాక్సిన్ల మిశ్రమానికి సంబంధించి ఎలాంటి భద్రతా సమస్యలు లేవని అబ్రహం తెలిపారు. “అనుకోకుండా రెండు వేర్వేరు టీకాలు రెండు మోతాదులో ఇచ్చే పరిస్థితి ఉంది. మేము ఆ నమూనాలను NIV (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) లో పరీక్షించాము. డు మోతాదులలో వివిధ టీకాలు పొందిన రోగులు సురక్షితంగా ఉన్నట్లు కనుగొన్నాము. ఎటువంటి ప్రతికూల ప్రభావం గుర్తించలేదు. ఇమ్యునోజెనిసిటీ కొద్దిగా మెరుగ్గా ఉంది. కాబట్టి, ఇది ఖచ్చితంగా భద్రతా సమస్యకు కారణం కాదు. దీనిపై అధ్యయనం చేస్తున్నారు. కొన్ని రోజుల్లో మరిన్ని వివరాలను ఇవ్వగలరు అని ప్రియా అబ్రహం వివరించారు.

టీకా తీసుకోవడం తప్పనిసరి అని ప్రియా అబ్రహం అన్నారు. అంతేకాదు, కరోనా కొత్త వేరియంట్లపై టీకాలు పని చేస్తున్నాయని వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటిబాడీలు తయారవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న టీకాలు వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయని అధ్యయనాలు చూపించాయి. వేరియంట్ల విషయంలో యాంటీబాడీల సామర్థ్యం రెండు నుంచి మూడు రెట్లు తగ్గినట్లు గుర్తించాము. టీకాలు ఇప్పటికీ వేరియంట్లకు వ్యతిరేకంగా రక్షణగా ఉన్నాయి. వారు కొంచెం తక్కువ సామర్థ్యాన్ని చూపించవచ్చు. కానీ ఆసుపత్రి పాలు చేసే, మరణానికి దారితీసే తీవ్రమైన వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి, డెల్టా సహా వేరియంట్ ఏదైనా.. టీకా రక్షణ కల్పిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని ప్రియా అబ్రహం సూచించారు.