కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గింపు!

కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గింపు!

Covid vaccine price కోవిడ్ వ్యాక్సిన్ ధర తగ్గనున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ “కోవిషీల్డ్” ధర విషయమై సీరం సంస్థతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపిందని,ప్రస్తుతమున్న ధర కంటే గణనీయంగా కోవిషీల్డ్ ధర తగ్గనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. కాగా,ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్..రూ.250వరకూ ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ కు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే వ్యాక్సిన్ ధర రూ.200కన్నా తక్కువ ఉండేలా చర్చలు జరిపినట్లు తెలిపారు.

ఇక,భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లలో “కోవిషీల్డ్”ఒకటి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనికా కంపెనీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ను పూణేలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. పన్నులు మినహాయించి ఒక్కో మోతాదుకు 150 రూపాయల కన్నా తక్కువకే కోవిషీల్డ్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా సీరంతో చర్చలు జరిపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వం.. పన్నుతో సహా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒక్కో డోసుకి రూ .210కి చెల్లించి కొనుగోలు చేస్తోంది. మరోవైపు, ఈ సందర్భంగా..దేశంలో తగినంత వ్యాక్సిన్ నిల్వ ఉందా అనే ప్రశ్నకు రాజేష్ భూషణ్ “కొరత లేదు” అని సమాధానమిచ్చారు.

ఇక,దేశవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నాం ఒంటి గంట సమయానికి..2,56,90,545మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు భూషణ్ తెలిపారు. 71శాతం వ్యాక్సిన్ల డోసులను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే ఇచ్చినట్లు,28.77శాతం డోసులు ప్రేవేట్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు అందించబడ్డాయని భూషణ్ తెలిపారు.