6 నుంచి 7 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్

6 నుంచి 7 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్

India to Inoculate 30 crore people 6-7 Months : భారతదేశపు కోవిడ్-19 కేసుల సంఖ్య ఒక కోటి మార్కును దాటేసింది. వచ్చే 6 నుండి 7 నెలల్లో దేశానికి సుమారు 30 కోట్ల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులో ఒక కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్-19 సోకినవారిలో 95 లక్షల 50 వేల మంది కోలుకున్నారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రానున్న 6 నుంచి 7 నెలల్లో 30 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు మంత్రి హర్షవర్థన్ తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక రికవరీ రేట్లు 95.46శాతంగా ఉందని తెలిపారు. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు కరోనావైరస్ ద్వారా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసి స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారని మంత్రి చెప్పారు. కోవిడ్‌–19పై మంత్రుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

జీనోమ్‌ సీక్వెన్స్‌ ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. కోటికి పైగా కేసులు మన దేశంలో నమోదైనప్పటికీ, రికవరీ రేటు విషయంలో భారత్‌ చాలా ముందుందని అన్నారు. పండుగల సీజన్‌లో కూడా దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య పరిమితిని మించి పెరగలేదన్నారు.

పండుగ సమయాల్లో తీసుకున్న జాగ్రత్తలనే వ్యాక్సినేషన్‌ సమయంలో కూడా పాటించాలని ఆయన సూచించారు.కరోనా సమయంలో ప్రధాని మోడీ తీసుకున్న చర్యలే దేశంలో కరోనాను కట్టడి చేయడానికి దోహదపడిందని హర్షవర్ధన్‌ వ్యాఖ్యానించారు. 30 కోట్ల మంది వ్యాక్సిన్ అందించాలని అంచనా వేయగా.. లక్ష్య జనాభాకు సరిపోయేలా త్వరితగతిన టీకా డ్రైవ్ ప్రారంభించాల్సిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేశారు.

దేశంలోని కోవిడ్ -19 కేసుల సంఖ్య 25,153 కొత్త కేసులతో 1 కోట్ల మార్కును దాటి మొత్తంగా 1,00,04,599 కు చేరుకుంది. కోవిడ్-19 మరణాల సంఖ్య కూడా 1,45,136కు చేరుకుంది. ఒక కోట్లకు పైగా కోవిడ్-19 కేసులలో కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య 95,50,712 చేరగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,08,751గా నమోదైంది.