Vaccine Single Dose : కరోనా సోకిన వాళ్లకు గుడ్ న్యూస్

దేశంలో కొవిడ్ టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రెండు టీకాలను కలిపిగా పరీక్షించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒకే మోతాదు ప్రభావాన్ని పరీక్షించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది.

Vaccine Single Dose : కరోనా సోకిన వాళ్లకు గుడ్ న్యూస్

Vaccine Single Dose

Covid Vaccine Single Dose : దేశంలో కొవిడ్ టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రెండు టీకాలను కలిపిగా పరీక్షించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒకే మోతాదు ప్రభావాన్ని పరీక్షించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. వైరస్ కు రోగనిరోధక ప్రతిస్పందన పెంచేందుకు ఈ ప్రక్రియ సహాయ పడుతుందో లేదో తెలుసుకునేందుకు కేంద్రం తాజా వ్యూహాలు రచిస్తోంది. రోగ నిరోధకాలను పెంచేందుకు రెండు వేర్వేరు మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్లను కలిపే నియమావళి సాధ్యతను కూడా భారత ప్రభుత్వం పరీక్ష నుంచనుంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇమ్యునైజేషన్ చైర్మర్ అరోరా తెలిపారు.

ఇక కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఒక్క మోతాదు వ్యాక్సిన్ సరిపోతుందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకుడు తెలిపారు. కొవిడ్ సోకిన వ్యక్తులపై అధ్యయనం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కోలుకున్న వ్యక్తుల్లో ప్రతిరోధకాలు మొదటి వారంలోనే అభివృద్ధి చెందాయని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. కొవిడ్ సోకిన వారిలో 90శాతం మందిలో మూడు నుంచి నాలుగు వారాల తర్వాత ప్రతిరోధకాలు అభివృద్ధి చెందగా, కోలుకున్న వారిలో మాత్రం మొదటి డోసు తర్వాతే ప్రతిరోధకాలు పెరుగుతున్నట్టు గుర్తించారు. కోలుకున్న వ్యక్తులకు కేవలం ఒకే డోసు ఇవ్వడం ద్వారా టీకా కొరతను అధిగమించవచ్చని, ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రధానికి కూడా లేఖ రాసినట్లు బీహెచ్ యూ ప్రొ.జ్ఞానేశ్వర్ తెలిపారు.

అయితే ఇది సరైన ఆలోచన కాదంటున్నారు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ సలహాదారు ప్రొ.గిరిధర్ బాబు. వ్యాక్సిన్ ఒక డోసు సమర్ధత నిరూపించడానికి సరైన డేటా లేదన్నారు. కేవలం వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు సింగిల్ డోసు చాలని చెప్పడం సరైంది కాదన్నారు. ఇక దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సూచించారు.