Vaccine Wastage : దేశంలో భారీగా వ్యాక్సిన్ వృథా, ఆ 10 రాష్ట్రాల్లో మరీ అధ్వానం… కారణమేంటి?

దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాక్సిన్ వృథాను తగ్గించకపోతే టీకా కేటాయింపుల్లో కోత విధిస్తామని, కేంద్రం హెచ్చరించినా, పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కోవిషీల్డ్ తో పోలిస్తే కోవాగ్జిన్ ఎక్కువగా వృథా అవుతోంది.

Vaccine Wastage : దేశంలో భారీగా వ్యాక్సిన్ వృథా, ఆ 10 రాష్ట్రాల్లో మరీ అధ్వానం… కారణమేంటి?

Vaccine Wastage

Vaccine Wastage : దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాక్సిన్ వృథాను తగ్గించకపోతే టీకా కేటాయింపుల్లో కోత విధిస్తామని, కేంద్రం హెచ్చరించినా, పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కోవిషీల్డ్ తో పోలిస్తే కోవాగ్జిన్ ఎక్కువగా వృథా అవుతోంది.

వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేసిన అమెరికాలో టీకా వృథా కేవలం 0.12 శాతమే. వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న భారత్ లో మాత్రం టీకా వృథా 3.06శాతంగా ఉంది. దేశంలోని పది రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. రాజస్తాన్, హర్యానా, తమిళనాడు, బీహార్, పంజాబ్ సహా పది రాష్ట్రాలు టీకాను ఎక్కువగా వృథా చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే హర్యానాలో ఈ వేస్టేజ్ భారీగా ఉంది. ఆ రాష్ట్రం తమకు కేటాయించిన టీకాలో 6.49శాతం వృథా చేస్తోంది. వృథాను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రాలు అంటున్నాయి. వృథా ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి ప్రజలకు వేగంగా వ్యాక్సిన్ అందించడం ద్వారా వేస్టేజ్ ను అరికడుతున్నామని చెబుతున్నాయి.

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వయల్స్ సరఫరా చేస్తోంది. ఒక్కో వయల్ లో 20 డోసులు ఉంటాయి. ఒక్కసారి కోవాగ్జిన్ వయల్ తెరిచిన తర్వాత 4 గంటల సమయంలో పంపిణీ చేయాలి. లేదంటే, ఆ డోసులు మొత్తం వృథా అయినట్టే. వ్యాక్సిన్ ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రజలకు, ప్రభుత్వాలకు సరైన అవగాహన లేక టీకా వృథా అయ్యింది. వయల్ ఓపెన్ చేసిన తర్వాత డోసులకు సరిపడ ప్రజలు ఆ సమయానికి రాకపోవడంతో అవన్నీ వేస్ట్ అయ్యేవి. టీకా డిమాండ్ పెరిగిన తర్వాత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వయల్ ఓపెన్ చేసిన వెంటనే డోసులన్నీ వేగంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొంతమేర వ్యాక్సిన్ వేస్టేజ్ తగ్గింది.

టీకా పంపిణీ ప్రారంభమైన తొలి రోజుల్లో పోలిస్తే, కోవ్యాగ్జిన్ టీకా వృథా 16శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. కోవిషీల్డ్ వృథా 6 శాతం నుంచి 1శాతానికి తగ్గింది. 10శాతం వ్యాక్సిన్ వృథా చేసిన తమిళనాడు దాన్ని 4.13శాతానికి తగ్గించగలిగింది. మొదట్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తిని చూపేవారు కాదని, దీంతో వ్యాక్సిన్ వృథా అయ్యేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ వృథాను తగ్గించడానికి వ్యాక్సినేషన్ సెంటర్ లో 10మంది ఉంటేనే వయల్ ఓపెన్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వృథా భారీగా తగ్గిపోయింది. కరోనా కట్టడి చర్యల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళ, ఒడిషా రాష్ట్రాలు.. వ్యాక్సినేషన్ లోనూ అదే విధంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అసలు వ్యాక్సిన్ వృథా కాలేదు.