Covid-19 Children : కరోనా డేంజర్ బెల్స్.. చిన్నపిల్లలపై కొవిడ్ పంజా

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చిన్న పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే దిశగా రూపం మార్చుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు వెయ్యి మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది.

Covid-19 Children : కరోనా డేంజర్ బెల్స్.. చిన్నపిల్లలపై కొవిడ్ పంజా

Covid Virus Attack On Children With In 10 Days Uttarakhand

Covid Virus Attack on Children : దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చిన్న పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే దిశగా రూపం మార్చుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు వెయ్యి మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా అందింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరారు.

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 15 తేదీల మధ్య 2 వందల 64 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు వెయ్యి 53 మందికి, ఈ నెల ఒకటి నుంచి 14 వరకు వెయ్యి ఆరు వందల 18 మంది చిన్నారులకు వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చిన్నారులపై కొవిడ్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోందని స్పష్టమవుతోంది.

మొత్తంగా 21 వేల 8 వందల 57 మంది చిన్నారులకు వైరస్ సోకింది. కేవలం ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చిన్నారుల్లో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో చిన్నారులకు త్వరగా అందుబాటులోకి వస్తేగాని కట్టడి చేయలేమని….టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.