covid positive bride and groom : కొత్త జంటలకు కరోనా కష్టాలు : హ‌నీమూన్‌కు వెళ్లాల్సినవాళ్లు..ఐసోలేష‌న్‌కు..

పెళ్లి అయిన ఓ కొత్త జంట చక్కగా హనీమూన్ కు వెళదామనుకున్నారు. కానీ వారి కలల్ని కరోనా కల్లలలు చేసింది. హనీమూన్ కు వెళదామని అన్ని ప్లాన్లు వేసుకున్నాక..ఆ కొత్త జంట ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. పాపం ఆనందంగా పెళ్లిచేసుకున్న ఆ కొత్త దంపతులు ఊహించకపోవటంతో ఊస్సూరుమంటూ..హోం ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. వారి ఆనందమంతా నీరుగారిపోయింది. కారణం కరోనా పాజిటివ్.

covid positive bride and groom : కొత్త జంటలకు కరోనా కష్టాలు : హ‌నీమూన్‌కు వెళ్లాల్సినవాళ్లు..ఐసోలేష‌న్‌కు..

Covid19 Positive Bride And Groom

covid19 positive bride and groom: ఆనందంగా పెళ్లి చేసుకున్నవాళ్లు చక్కగా హనీమూన్ కు చెక్కేస్తారు. కానీ ఇది కరోనా కాలం. మనం అనుకున్నవన్నీ జరగవ్. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా జరగట్లేదు కూడా. కరోనా మహమ్మారి ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో తెలియట్లేదు. పెళ్లి అయిన ఓ కొత్త జంట చక్కగా హనీమూన్ కు వెళదామనుకున్నారు. కానీ వారి కలల్ని కరోనా కల్లలలు చేసింది. హనీమూన్ కు వెళదామని అన్ని ప్లాన్లు వేసుకున్నాక..ఆ కొత్త జంట ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. పాపం ఆనందంగా పెళ్లిచేసుకున్న ఆ కొత్త దంపతులు ఊహించకపోవటంతో ఊస్సూరుమంటూ..హోం ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. వారి ఆనందమంతా నీరుగారిపోయింది. కారణం కరోనా పాజిటివ్. దీంతో ఆ జంట పసుపు బట్టలతోనే హోం ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గ‌ల‌ రాప్తినగర్‌లో ఉంటున్న‌ సీనియర్ రైల్వే అధికారి కుమారుడికి మే2న ఘ‌నంగా వివాహం జ‌రిగింది. ఆ తరువాత వ‌ధువులిద్దరినీ హనీమూన్ పంపించాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. కానీ ప్చ్..పాపం వాళ్ల ప్లాన్ తల్లక్రిందులైంది. పెళ్లి చేసుకున్నాక ఆనందంగా ఇంటికి వచ్చిన ఆ జంటను ముతైదువలు అల్లరి పట్టిస్తూ ఇంటిలోకి స్వాగ‌తించారు. ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇంటిలో సరదాలు..సరసాలు ఎక్కువసేపు ఉండలేదు. పెళ్లి జరిగిన కొద్ది గంట‌ల్లోనే వ‌ధూవ‌రులిద్ద‌రూ క‌రోనా బారిన ప‌డ్డార‌ని నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంకేముందీ? ఇద్దరూ ఉస్సూరుమన్నారు. ఒకరి మొహాలు మరొకరు దిగాలుగా..దీనంగా చూసుకున్నారు. హనీమూన్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న శుభసమయంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కొత్త జంట హోంఐసోలేష‌న్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది.

ఇలాంటి ఘటనలు ఈ ఒక్కరికే కాదు ఈ కరోనా కాలంలో చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. గీడా ప్రాంతానికి చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో మే 2న పెళ్లి వేడుక అంగరంగ వైభోగాంగా చాలా కొద్దిమంది అతిథుల మధ్యే జరిగింది. కానీ వారి వివాహానికి అమెరికాకు చెందిన వారి బంధువుతో పాటు ప‌లువురు క‌రోనా మహమ్మారి బారిన ప‌డ్డారు. అలాగే మరొకరి పరిస్థితి. బిచియా క్యాంప్ లోని ఒక ఫ్యామిలీలో ఏప్రిల్ లో జరిగిన వివాహంలో కూడా ఇదే పరిస్థితి. పెళ్లి జరిగిక కొద్ది సమయానికే ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు క‌రోనాకు బ‌ల‌య్యారు. కేవలం 10 రోజుల్లోనే ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో వివాహం జరిగిన ఇంట్లో విషాదం నిండుకుంది. ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ బాలిక కూడా ఈ మరణాల్లో ఉండటం మరో విషాదం.