Covid’s AY.4.2 : భయం వద్దు…AY.4.2 వేరియంట్ ప్రభావం తక్కువే!

కోవిడ్ వైరస్ యూరప్ దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. ఇందుకు కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే..భారత్ లో దీని ప్రభావం తక్కువేనని నిపుణుల బృందం వెల్లడిస్తోంది.

Covid’s AY.4.2 : భయం వద్దు…AY.4.2 వేరియంట్ ప్రభావం తక్కువే!

India Covid

Covid’s AY.4.2 Variant : కరోనా వైరస్ అనంతరం వ్యాపిస్తున్న కొత్త కొత్త వేరియంట్ లతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వివిధ దేశాల్లో వైరస్ ఆనవాళ్లు గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ వైరస్ యూరప్ దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. ఇందుకు కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే..భారత్ లో దీని ప్రభావం తక్కువేనని నిపుణుల బృందం వెల్లడిస్తోంది. కేవలం 0.1 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జీన్ మిక్స్ కన్సార్టియం వెల్లడిస్తోంది.

Read More : Kuppam Municipal Election: అధికార, ప్రతిపక్షాల ఎత్తుగడలు.. హీట్ పెంచేస్తున్న కుప్పం!

దేశంలో AY.4.2 వేరియంట్ వ్యాప్తి పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధార లేవని ఇన్సాకాగ్ తెలిపింది. ఇప్పటి వరకు వ్యాప్తిలో ఉన్న వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ లతో పోలిస్తే…దీని ప్రభావం…0.1 శాతం కంటే..తక్కువగా ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ తో…ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం దేశంలో డెల్టా (B.1 617.2)..మాత్రమే ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది.

Read More : Online Cheating : ఫోన్ లాక్ చేశారు..మేసేజ్‌లు రాలేదు..రూ. 24 లక్షలు స్వాహా

కోవిడ్ వైరస్ మారి…ప్రస్తుతం ఏవై..4.2 వేరియంట్…రూపంలో వ్యాప్తి…చెందుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్…ఆల్…ఇన్ ఫ్లుయెంజా..డేటా ప్రకారం…భారత్ లో ఇప్పటి వరకు 17 నమూనాల్లో ఏవై…4.2 వేరియంట్…ను గుర్తించారు. చాలా వేగంగా వ్యాపించినా..అంత ప్రమాదకరం కాదని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి ఏవై.4.2పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు వెల్లడిస్తుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.