Vaccine For Pregnant: గర్భిణీలకు.. పాలిచ్చే తల్లులకు ఈ వ్యాక్సిన్లు సేఫ్

నీతి అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆ వ్యాక్సిన్లు మాత్రం సేఫ్ అని వెల్లడించారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని..

Vaccine For Pregnant: గర్భిణీలకు.. పాలిచ్చే తల్లులకు ఈ వ్యాక్సిన్లు సేఫ్

Vaccines For Pregenet

Vaccine For Pregnant: నీతి అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆ వ్యాక్సిన్లు మాత్రం సేఫ్ అని వెల్లడించారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్, మోడర్నా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ పై ఇస్తోన్న సూచనలలో వీటిని కూడా జత చేయనున్నారు. వీటిని తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు.

ముందుగా ఇండియా ప్రభుత్వం.. కొవీషీల్డ్, కొవాగ్జిన్ లకు మాత్రమే కొవిడ్ వ్యాక్సినేషన్ అనుమతినిచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ యూజ్ కోసం స్పుత్నిక్ వీ కూడా అప్రూవల్ దక్కింది. ఇనాక్యులేషన్ డ్రైవ్ లో భాగంగా మోడర్నా కూడా ఆమోదం దక్కించుకుంది.

‘కొవాగ్జిన్, కొవీషీల్డ్, స్పుత్నిక్ వీ, మోడర్నా నాలుగు వ్యాక్సిన్లు పాలిచ్చే తల్లులకు, గర్భిణీలకు సేఫ్ అని తెలిసిందని డా.వీకే పాల్ మీడియా సమావేశంలో అన్నారు.

ఈ మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వ్యాక్సినేటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వనుంది హెల్త్ మినిస్ట్రీ. దాంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్న గర్భిణీలు హాస్పిటలైజేషన్ అవ్వకుండానే 90శాతం మంది మహిళలు కోలుకున్నారని వెల్లడించారు. అందుకే గర్భిణీలు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటే శ్రేయస్కరమని సూచించారు.

పాలిచ్చే తల్లులు, గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హై రిస్క్ నుంచి రక్షణ దొరుకుతుంది. వేయించుకోకపోవడం వల్ల హై రిస్క్ లేదా ప్రాణాంతకమైన సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. హాస్పిటల్ కు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.. వారిని ఎడ్యుకేట్ చేసి వ్యాక్సిన్ వేయించగలిగితే చాలా వరకూ ప్రమాదం నుంచి తప్పించగలమని చెబుతున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న గర్భిణీల్లో చాలా తక్కువ మందిలో మాత్రమే 20రోజుల్లో కొద్దిపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వారు మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.