Covaxin : రెగ్యులర్ మార్కెట్‌లోకి రానున్న కొవీషీల్డ్, కొవాగ్జిన్

కొవీషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెగ్యూలర్ మార్కెట్ లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ నుంచి అప్రూవల్ కూడా.

Covaxin : రెగ్యులర్ మార్కెట్‌లోకి రానున్న కొవీషీల్డ్, కొవాగ్జిన్

Covaaxin

Covaxin: కొవీషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెగ్యూలర్ మార్కెట్ లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ నుంచి అప్రూవల్ కూడా దక్కించుకుంది. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు.

సబ్జక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ నుంచి అప్రూవల్ వచ్చిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లు కన్ఫామ్ చేశాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు.

‘సీఈసీ కొవీషీల్డ్, కొవాగ్జిన్ స్టాటస్ ను అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వాడకానికి మాత్రమే అనుమతిని రిస్ట్రిక్టెడ్ యూజ్ కు ఓకే చెప్పింది. ఇక డీసీజీఐ తన రికమండేషన్సన్ వివరించి నిర్ణయాన్ని వెల్లడించనుంది’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 12రోజులుగా ఐసీయూలో లతా మంగేశ్కర్..

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెండోసారి సీరమ్, భారత్ బయెటెక్ అప్లికేషన్లు పరిశీలించింది. బుధవారం రెగ్యూలర్ మార్కెట్ లో విక్రయించేందుకు అప్రూవల్ ఇచ్చింది. అని సబ్జక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ చెప్పింది.

ఇప్పటివరకూ ఈ వ్యాక్సిన్లు మార్కెట్ ను కొవిన్ యాప్ లో పొందుపరచాల్సి ఉండేది. క్లినిక్స్, హాస్పిటల్స్ లో ఎక్కడైనా వ్యాక్సిన్ వాడకం జరిగితే కొవిన్ యాప్ లో రిజిష్టర్ అయి ఉండాలి. అడ్మినిష్ట్రేషన్ సమయంలో వివరాలను కొవిన్ లో నమోదు చేస్తున్నారు.