Covishield Vaccine: కొవీషీల్డ్ పూర్తి తీసుకుంటే ఏడు నెలలకే యాంటీబాడీలు..

కొవీషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారిలో ఏడు నెలలకే 90శాతం యాంటీబాడీలు జనరేట్ అవుతాయని అంటున్నారు. 500కు పైగా హెల్త్ వర్కర్లలో ఈ విషయం నిరూపితమైందని చెబుతున్నారు.

Covishield Vaccine: కొవీషీల్డ్ పూర్తి తీసుకుంటే ఏడు నెలలకే యాంటీబాడీలు..

3.48 Lakhs Of Covishield Vaccines (1)

Covishield Vaccine: కొవీషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారిలో ఏడు నెలలకే 90శాతం యాంటీబాడీలు జనరేట్ అవుతాయని అంటున్నారు. 500కు పైగా హెల్త్ వర్కర్లలో ఈ విషయం నిరూపితమైందని చెబుతున్నారు. రీసెర్చ్ ప్రకారం.. పూర్తి డోస్ తీసుకున్న వారిలో 90శాతం యాంటీబాడీలు వచ్చాయట. అది చాలా గొప్ప ఉపశమనమని పూణెలోని బీజే గవర్నమెంట్ మెడికల్ కాలేజి వెల్లడించింది.

రిపోర్టుల ప్రకారం.. ఇండియాలో చాలా మంది కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోలేదని అంటున్నారు. అందుకే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

మొత్తం 558హెల్త్ వర్కర్లు కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు కంప్లీట్ చేసుకున్నారు. వాళ్లందరిలోనూ 90శాతం కంటే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పన్నమయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ‘రెండు డోసుల మధ్య గ్యాప్ పెరిగిన కొద్దీ కరోనా వ్యాక్సిన్ వల్ల ఉత్పన్నమయ్యే యాంటీబాడీల సంఖ్య మరింత పెరుగుతుంది’ అని చీఫ్ డాక్టర్ వ్యాఖ్యానించారు.

…………………………..: మాల్దీవులకే మెంటలెక్కిస్తున్న సోఫీ చౌదరి!

కొవీషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ వేసుకున్నవారిలో మూడు నెలల తర్వాత 96.77శాతం యాంటీబాడీలు వచ్చాయని, ఏడు నెలల తర్వాత 91.89శాతం కనిపించాయని తెలిసింది.