Cow In ICU Ward : ఇదేందయ్యా ఇది.. ఐసీయూ వార్డులోకి ప్రవేశించిన ఆవు, ఎంత హాయిగా తిరిగిందో చూడండి

ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఆవు ప్రవేశించింది. హాయిగా తిరిగింది. అంతేనా.. నాకు అడ్డు చెప్పేదెవరు అనుకుందో ఏమో.. నేరుగా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి కూడా వెళ్లింది.

Cow In ICU Ward : ఇదేందయ్యా ఇది.. ఐసీయూ వార్డులోకి ప్రవేశించిన ఆవు, ఎంత హాయిగా తిరిగిందో చూడండి

Cow In ICU Ward : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతటి దారుణ పరిస్థితుల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకున్న అభిప్రాయం ఇది. తాజాగా సర్కారీ దవాఖానాల్లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉంటాయో తెలపడానికి ఈ ఘటనే నిదర్శనం.

అదో ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇంతలో ఊహించని అతిథి హాస్పిటల్ లోకి వచ్చేసింది. ఆ గెస్ట్ ని చూసి పేషెంట్లు అవాక్కయ్యారు. ఆ అతిథి మరెవరో కాదు.. ఓ ఆవు.

అవును.. ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఆవు ప్రవేశించింది. హాయిగా ఆసుపత్రిలో తిరిగింది. ఆ ఆవుని గమనించి, బయటకు పంపించేవారు లేకపోవడంతో.. అది నేరుగా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి కూడా వెళ్లింది. రోగులున్న ప్రదేశాల్లో తిరుగాడింది. అయితే ఎవరో ఆ ఆవును గమనించి.. వీడియో తీశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో ఆవు విహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఆసుపత్రి ఐసీయూ వార్డులోకి ఆవు వచ్చే వరకూ సిబ్బంది ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆ వీడియో చూసి ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. వెంటనే సీనియర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. జరిగిన ఘటనపై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. అంతేకాదు, సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పందించారు. అది పాత కోవిడ్ ఐసీయూ వార్డు అని ఆయన తెలిపారు.

ఐసీయూ వార్డులో ఆవు విహారం..