ఆవు మూత్రం తాగితే కరోనా వైరస్ అంటుకోదా?

  • Published By: vamsi ,Published On : February 4, 2020 / 08:43 AM IST
ఆవు మూత్రం తాగితే కరోనా వైరస్ అంటుకోదా?

వెతికితే ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.. ప్రతి రోగానికీ మందు ఉంటుంది. కాకపోతే కనిపెట్టడమే కాస్త ఆలస్యం అవుతుంది. కనిపెట్టలేనంతకాలం అది సమస్యే. ఆ సమస్యతో అవస్థలు పడక తప్పదు. ప్రపంచంలో ఏ సమస్య ఎలా ఉన్నా కూడా వైరస్‌ల ఎటాక్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. అది డెంగ్యూ అయినా చికెన్ గున్యా అయినా.. ఇంకెదైనా వైరస్ అయినా పుట్టుకతో ప్రమాదం తెస్తుంది. భయపెడుతుంది. పదుల సంఖ్యలోనో, వందల సంఖ్యలోనో ప్రాణాలను హరిస్తుంది.

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా అటువంటిదే. అయితే ఇదిలా ఉంటే ఇటువంటి విపత్కర పరిణామాలు వచ్చినప్పుడు మాత్రం కొన్ని రూమర్లు విస్తృతంగ ప్రచారం అవుతుంటాయి. అందులో ఒకటి ఏమిటంటే.. కరోనా వైరస్‌కు ఆవు మూత్రం మందు అట.. అందుకోసం ఆవు మూత్రాన్ని ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేయించుకుంటుందట చైనా. చైనాలో వుహాన్ అనే సిటీలో ప్రబలిన కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. జస్ట్, రోగుల దగ్గు ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఇప్పటికే వంద మంది చనిపోయారు. వేలమందికి వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇది వ్యాప్తి చెందకుండా అనేక దేశాల్లో స్క్రీనింగ్ క్యాంపులు పెట్టారు.

అయితే చివరకు ఈ వ్యాధికి ఎయిడ్స్ వ్యాధికి వాడే మందులను వాడుతున్నారట చాలా దేశాల్లో. అదైతేనే వ్యాధిని కొంచెం కంట్రోల్’లో ఉంచుతుందట. అయితే ఆవు మూత్రం సరఫరా చెయ్యడం అనే మాట మాత్రం అవాస్తవం. నిజంగా ఆవు మూత్రమే మందు అయితే ఆ దేశంలో ఆవులు లేవా? అనేది ప్రశ్న. ఆవు మూత్రం తాగడం.. ఆవు పేడను తినడం వల్ల కొరోనావైరస్ ప్రభావం ఆగిపోతుందని, ఓం నమ: శివాయ అంటూ జపం చేసి, ఆవు పేడను శరీరంపై పూసిన వ్యాధి వ్యాపించదు అంటూ సాగుతున్న ప్రచారం అవాస్తవం అంటున్నారు.