Cowin App : కొవిన్ యాప్‌.. కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చింది.. ఇదేలా పనిచేస్తుందంటే?

కోవిడ్-19 వ్యాక్సినేషన్ యాప్ కొవిన్ పోర్టల్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చేసింది.. యాప్ సెక్యూరిటీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ సెక్యూరిటీ ఫీచర్ ను యాడ్ చేసింది.

Cowin App : కొవిన్ యాప్‌.. కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చింది.. ఇదేలా పనిచేస్తుందంటే?

Cowin App 4 Digit Security Code Feature Added By Center Govt (1)

Cowin App 4-Digit Security Code : కొవిడ్-19 వ్యాక్సినేషన్ యాప్ కొవిన్ పోర్టల్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ వచ్చేసింది.. యాప్ సెక్యూరిటీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ సెక్యూరిటీ ఫీచర్ ను యాడ్ చేసింది. కొవిన్‌ పోర్టల్‌ డేటా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన నేపథ్యంలో కేంద్రం ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ‘4-అంకెల సెక్యూరిటీ కోడ్’ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూప్ తప్పుగా వినియోగించే అవకాశాలు ఉండవు. డేటా ఎంట్రీ ఎర్రర్స్ కూడా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 8 నుంచి ఈ ఫీచర్‌ అమల్లోకి వచ్చింది.

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నాక.. ఎంపిక చేసిన తేదీ రోజున వ్యాక్సినేషన్ కోసం వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి వ్యాక్సినేషన్ జరిగినట్టు ఎస్ఎంఎస్ వస్తోంది. దీనిపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ ద్వారా ప్రజలకు
ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ -19 వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న ఈ టీకాను తీసుకోన్నారో లేదో దీనిద్వారా తెలుసుకోవచ్చు. వ్యాక్సినేటర్ లోపాన్ని సరిదిద్దేందుకు కొవిన్ యాప్‌లో ఈ నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ ఫీచర్ తీసుకొచ్చారు.

టీకా స్లాట్ కోసం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేవారికి ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ వర్తిస్తుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ మీద ఈ కోడ్ ప్రింట్ అవుతుంది. లబ్ధిదారుకు అపాయింట్‌మెంట్ తర్వాత వచ్చే ఎస్ఎంఎస్‌లో ఈ నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను మొబైల్‌ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో ఈ కోడ్ చూపిస్తే సరిపోతుంది.