మెట్రో స్టేషన్‌లో క్రాక్ : బ్లూ‌లైన్ సర్వీసులకు ఎఫెక్ట్

  • Published By: sreehari ,Published On : November 2, 2019 / 01:14 PM IST
మెట్రో స్టేషన్‌లో క్రాక్ : బ్లూ‌లైన్ సర్వీసులకు ఎఫెక్ట్

నగరంలోని మెట్రో స్టేషన్‌లో క్రాక్ కలకలం రేపింది. మెట్రో స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌పై పగళ్లు కనిపించాయి. దీంతో శనివారం మెట్రో బ్లూలైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలోని మెట్రో బ్లూలైన్ సర్వీసులు నడిచే ఇంద్రప్రస్థా స్టేషన్ దగ్గర రైల్వేట్రాక్ వెల్డింగ్ క్రాక్ ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.

ఇంద్రప్రస్థా, ప్రగతి మెయిడెన్ స్టేషన్ల మధ్య వైశాలి, నోయిడా ఎలక్ట్రిక్ సిటీని బ్లూ లైన్ కలిపే ద్వారకా సెక్టార్ 21 రైల్వే మార్గంలోని ట్రాక్ పై పగళ్లు ఉన్నట్టు గుర్తించినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రతినిధి అనూజ్ దయల్ తెలిపారు. 

రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్టు 8.30 గంటల ప్రాంతంలో గుర్తించినట్టు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో బ్లూ లైన్ సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్టు దయల్ తెలిపారు. ఇదే మార్గంలో వెళ్లే మెట్రో రైళ్లను జాగ్రత్తచర్యగా నిదానంగా నడుపుతున్నట్టు దయల్ చెప్పారు.

ఇటీవల ఢిల్లీలో వాతావరణ మార్పుల కారణంగా రైల్వే ట్రాక్ పై లోపాలు తలెత్తినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రైల్వే సర్వీసులు పూర్తి సురక్షితంగా నడుస్తున్నాయని డీఎంఆర్సీ ప్రతినిధి చెప్పారు.