షాకైన ప్యాసింజర్ : గాల్లోనే పగిలిన SpiceJet విండో

  • Edited By: sreehari , November 5, 2019 / 02:01 PM IST
షాకైన ప్యాసింజర్ : గాల్లోనే పగిలిన SpiceJet విండో

ముంబై-ఢిల్లీకి చెందిన స్పైస్ జెట్ విమానం విండో అద్దం పగిలింది. విమానం గాల్లో ఉండగానే విండో మిర్రర్ బ్రేక్ అయింది. అదే విండో దగ్గర కూర్చొన్న ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ లైన్ వెంటనే ప్రయాణికుడికి క్షమాపణలు కూడా చెప్పింది. దీనికి సంబంధించి ప్రయాణికుడు ఒక ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు పెట్టారు.

దీంతో స్పందించిన స్పెస్ జెట్ వెంటనే అతడికి క్షమాపణలు తెలియజేసింది. ‘ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ప్రధానమైనది. ఈ విషయంలో ఎయిర్ లైన్ ఎంతమాత్రం రాజీపడదు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారికి తప్పకుండా తెలియజేస్తాం. అసౌకర్యం కలిగినందుకు మేం చింతిస్తున్నాం’ అని ఎయిర్ లైన్ తెలిపింది. 

అయినప్పటికీ, ప్యాసింజర్ ఎయిర్ లైన్ వాదనను తోసిపుచ్చాడు. ‘పగిలిన అద్దం దగ్గర ఏదైనా సెల్లో టేప్ అతికించి ఉంటే.. ఎవరికైనా పరిస్థితిపై అవగాహన ఉండేది’ అని తెలిపాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొంది. ఒకవేళ విమానం గాల్లోనే ఉండగా.. విండో పూర్తిగా పగిలిపోతే .. విమానంలోని కంప్రెసడ్ ఎయిర్ బయటకు వెళ్లిపోతుంది. తద్వారా క్యాబిన్ ప్రెజర్ పడిపోతుంది. అదే విమానంలో విండో పగిలిన చోట ఎవరైనా ప్రయాణికుడు కూర్చొంటే.. వారిని గాలి బయటకు లాగేసుకుంటుందని నిపుణులు అంటున్నారు. 

కొన్ని సెకన్లలోనే విమానంలోని ఉష్ణోగ్రత, ఒత్తిడి పడిపోయి, క్యాబిన్ లో పెద్దగా శబ్దం వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రయాణికులందరికి శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేకించి ఎవరైకితే శ్వాసరోగ సమస్యలు ఉన్నాయో వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదృష్టవశాత్తూ, ప్రయాణికులు ఎక్కిన స్పైస్ జెట్ విమానం SG8152, విండో కొద్దిగా మాత్రమే క్రాక్ అయిందే తప్ప పూర్తిగా పగిలిపోలేదు.