TATA Trust : దాతృత్వంలో టాటా ట్రస్ట్ .. విరాళాలు ఇచ్చే విషయంలో టాటాలే టాప్ .. ఎందుకయ్యారు..?

దాతృత్వం పేరు చెబితే మొదటగా వినిపించే పేరు టాటా ట్రస్ట్. భారత్‌ లో ఎన్నో సంవత్సరాల నుంచి టాటా ఇచ్చిన విరాళాలు కోట్లలో ఉంటాయి. మరి టాటాలు చేసిన దానాలు మరొకరు చేయలేదా..? దానగుణంలో టాటాలే టాప్ ఎందుకయ్యారు..? ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినా, కరోనా లాంటి కష్టాలు ఎదురైనా కొన్ని వేల కోట్ల రూపాయలను దానం చేసిన కోటీశ్వరులను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో బిల్ గేట్స్ ఒకరు . అయితే బిల్‌గేట్స్ కంటే ఎక్కువ విరాళాలు భారత్‌ కు చెందిన టాటా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయి. విరాళాలు ఇచ్చే విషయంలో టాటాలే టాప్..ఎందుకయ్యారు..?

TATA Trust :  దాతృత్వంలో టాటా ట్రస్ట్ .. విరాళాలు ఇచ్చే విషయంలో టాటాలే టాప్ .. ఎందుకయ్యారు..?

TATA Trust..Tata Industries Jamsetji Tata

TATA Trust..Tata Industries Jamsetji Tata : దాతృత్వం పేరు చెబితే మొదటగా వినిపించే పేరు టాటా ట్రస్ట్. భారత్‌ లో ఎన్నో సంవత్సరాల నుంచి టాటా ఇచ్చిన విరాళాలు కోట్లలో ఉంటాయి. మరి టాటాలు చేసిన దానాలు మరొకరు చేయలేదా..? దానగుణంలో టాటాలే టాప్ ఎందుకయ్యారు..?

ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినా, కరోనా లాంటి అనుకోని కష్టాలు ఎదురైనా కొన్ని వేల కోట్ల రూపాయలను దానం చేసిన కోటీశ్వరులను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో అందరికి బాగా తెలిసిన పేరు బిల్ గేట్స్ . తమ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో డొనేషన్ లను అందించారు. అతి గొప్ప పరోపకారులలో ఒకరిగా నిలిచారు. అయితే బిల్‌గేట్స్ కంటే ఎక్కువ విరాళాలు భారత్‌ కు చెందిన టాటా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయి. టటా సంస్థల్లో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్ .. మొత్తం డివిడెండ్స్ సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది.

టాటా ఇండస్ట్రీస్ సృష్టికర్త జంషెడ్ జి టాటా ఈ సేవా కార్యక్రమాలకు ఆద్యుడిగా చెబుతారు. 100 సంవత్సరాలకు గాను హురున్ రిపోర్ట్, ఎడెల్గైవ్ ఫౌండేషన్ తయారుచేసిన టాప్ -50 ఎక్కువగా దానాలు చేసిన వారి జాబితాలో జంషెడ్ జి టాటా మొదటి స్థానంలో నిలిచారు. అక్షరాల 102 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పరోపకారిగా లిస్ట్ లో మొదటి స్థానంలో చేరారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా 102 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారట. ఇప్పటి వరకూ ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించలేదు. ఆయన లక్ష్యలతో మొదలైందే టాటా ట్రస్ట్. వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని భారత్ పేదలకు విరాళాలుగా అందిస్తోంది టాటా ట్రస్ట్..ఎంత సంపాదించామన్నది కాదు… ఎంత ఇచ్చామన్నదే ముఖ్యంగా పనిచేస్తోంది ఈ సంస్థ.

తన కంపెనీ లాభాల్లో మూడింట రెండు వంతులు విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాలకు విరాళాలను కేటాయిస్తోంది. కొన్ని లక్షల కోట్లు సంపాదించినా సాయం చేసిన దానిలో ఉన్న ఆనందం మాత్రం కలగదు అంటారు టాటా ట్రస్ట్ నిర్వాహకులు. ఎంత కష్టపడి సంపాదించినా అందులో కొంత భాగం సామాజిక సేవకు ఉపయోగించాలంటారు. టాటా గ్రూపు మొదలైన ఏడాది నుంచి ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.