CRPF హెడ్ క్వార్టర్ కు సీల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 08:25 AM IST
CRPF హెడ్ క్వార్టర్ కు సీల్

దేశ రాజధానిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)హెడ్ క్వార్టర్ కి సీల్ వేశారు. సీఆర్పీఎఫ్ ప్రధానకార్యాలయంలో పని చేసే ఒకరికి ఆదివారం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో సీఆర్పీఎఫ్ ప్రధానకార్యాలయ్యాన్ని మూసివేశారు.

స్పెషల్ డైరక్టర్ జనరల్(SDG)ర్యాంక్ ఆఫీసర్ పర్శనల్ సెక్రటరీకి కరోనా వైరస్ సోకడంతో సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్ ను మూసివేసినట్లు తెలిపిన అధికారులు..బిల్డింగ్ ను శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ బిల్డింగ్ లో పనిచేసే అధికారులెవ్వరినీ కూడా బిల్డింగ్ పరిసరాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు. 

కాగా, ఈస్ట్ ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని 122 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి మయూర్ విహార్ ప్రాంతం మొత్తం సీల్ చేసేశారు. మరో వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు తెలియాల్సి ఉంది. ఈ బెటాలియన్ లో వెయ్యి మంది జవాన్లు ఉన్నారు. భారత్ లో కరోనా కేసులు దాదాపు 40వేలకు చేరుకోగా.. 1300కు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.