మావోయిస్టులకు రక్తదానం చేసిన జావాన్లు : సెల్యూట్ సైనికా

  • Published By: nagamani ,Published On : May 30, 2020 / 04:42 AM IST
మావోయిస్టులకు రక్తదానం చేసిన జావాన్లు : సెల్యూట్ సైనికా

మావోయిస్టులకు సిఆర్పీఎఫ్ జవాన్ లు రక్తదానం చేశారు. వీళ్లు ఒకరికొకరు ఎదురుపడితే ఆ ప్రాంతంలో తుపాకుల మోత మోగుతుంది. రక్తపాతమే జరగుతుంది. అటువంటిది సిఆర్పీఎఫ్ జవాన్ లు కరడుకట్టిన మావోలకు రక్తదానం చేయటం పెద్ద విశేషమే మరి. ఈ ఘటన ఎజార్ఖండ్ లో శుక్రవారం (మే29,2020)న జరిగింది.

సమాజంలో జరిగే కొన్ని అరాచకాలను అఘాయిత్యలను చూసి అడవిబాట పట్టి తుపాకీలతో మార్పులు తీసుకొద్దామనేది మావోల సిద్దాంతం. తుపాకీ పట్టినా అది దేశం కోసం సమాజం కోసమే..రాజ్యాంగం ప్రకారం..తమ ప్రాణాలను కూడా అడ్డువేసి శత్రువుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు పోరాడేవారు సిఆర్పీఎఫ్ జవాన్లు. వీరిద్దరూ పట్టింది తుపాకులే అయినా ఇద్దరి ఆలోచనల్లో..తాము నమ్మిన సిద్దాంతల్లో పూర్తి భిన్నత్వం ఉంది. 

వీళ్లు ఒకరికొరకు ఎదురుపడితే అక్కడ రక్తపాతమే. వాళ్ళను వీళ్ళు చంపడమా…? లేక వాళ్ళ చేతిలో వీళ్ళు చావడమా…? సిద్దాంతాలు వేరైనా ఇరు వర్గాలు మనుషులే. ఆ మానవత్వమే మావోయిస్టులకు సిఆర్పీఎఫ్ జవాన్లు రక్తదానం చేయటం. 

వివరాల్లోకి వెళితే..మే 29 క్రవారం జార్ఖండ్ లో మావోలకు..సిఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య కాల్పులో జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులను జవాన్లు కాల్చి చంపగా మరో ఇద్దరు మావోలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరినీ రజవాన్లు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో టాటానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు జవాన్ లు. తీవ్రగాయాలు కావటం..అప్పటికే వారు అనారోగ్యంతో ఉండటంతో రక్తం అవసరమయింది. నక్సలైట్ల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని రక్తదానం చేయడం చాలా అవసరమని డాక్టర్లు చెప్పారు. 

దీనితో వాళ్లు నక్సల్సే అయినా మనలాంటి మనుషులే కదా..చూస్తూ చూస్తూ వారిని అలా ఎలా వదిలేస్తాం అనే మానవత్వంతో ఓం ప్రకాశ్ యాదవ్, సందీప్ కుమార్  అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ మావోలకు రక్త దానం చేయడానికి ముందుకొచ్చారు. దీనితో వారు ఇచ్చిన రక్తంతో ఆ ఇద్దరు మావోల ప్రాణాలు డాక్టర్లు కాపాడగలిగారు.

దీనిపై రక్తదానం చేసిన  జవాన్ లు మాట్లడుతూ..దేశాన్ని రక్షించే క్రమంలో తాము కాల్పులు జరుపుతామని..మావోలపై మాకు ప్రత్యేకించి ఎటుంటి తమకు ఏ కోపం ఉండదన్నారు. సమాజంలో ఇద్దరమూ భాగమే అయినా ఇద్దరి దారులు వేరు..సమాజం కోసం రాజ్యాంగపరంగా తాము ప్రాణాలను కూడా పణ్ణంగా పెట్టి పోరాడుతామని..కానీ మావోలు సిద్దాంతాలు దారులు వేరు.  ఎంతోమంది  సీఆర్పీఎఫ్ లను చంపేస్తున్నారు. కానీ మా జవాన్ల ప్రాణాలు తీసేవారికి మానవత్వంతో రక్తదానం చేయడం చేసామని..రక్తదానం చేయటం మా కనీస ధర్మమని అందుకు మాకు  చాలా గర్వంగా ఉందని..వారి ప్రాణాలు కాపాడటానికే రక్తదానం చేసి..ప్రాణాలు కాపాడామని చెప్పారు. రక్తదానం చేసిన ఇద్దరినీ ఉన్నతాధికారులు అభినందించారు.

Read: డాక్టర్లకు ఎంత కష్టం వచ్చింది.. ఎండల్లో PPE కిట్‌ల వల్ల సమస్యలు..