RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్

క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్

Rbi On Cryptocurrencies (1)

RBI On Cryptocurrencies : క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టో కరెన్సీతో స్పష్టమైన ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక భద్రతకు క్రిప్టో కరెన్సీ మంచిది కాదని తేల్చి చెప్పారు. సురక్షితం కాదని తెలిసినా కొందరు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం పట్ల శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అంతర్జాతీయ అనిశ్చితితో క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”క్రిప్టో క‌రెన్సీల‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ముప్పు పొంచి ఉంది. అధునాత‌న పేరుతో వ‌దంతుల మ‌ధ్య క్రిప్టో క‌రెన్సీలు దూసుకెళ్తాయి. రోజురోజుకు ఆర్థిక వ్య‌వ‌స్థ డిజిట‌లీక‌ర‌ణ పెరిగిపోతోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ డిజిట‌లైజేష‌న్ పెరిగిన కొద్దీ సైబ‌ర్ ముప్పు పెరుగుతుంది. వాటిపై ప్ర‌త్యేక దృష్టి సారించాల్సి ఉంది. యుక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం, అంత‌ర్జాతీయ ఒడిదొడుకుల మ‌ధ్య ఆర్థిక వ్య‌వ‌స్థ అదుపు త‌ప్పుతుంది.

Top cryptocurrency prices today : యుక్రెయిన్‌ సంక్షోభం ఎఫెక్ట్ : భారీగా క్షీణించిన క్రిప్టో కరెన్సీ ధరలు..

ఈ ప‌రిస్థితుల్లో జాతీయ‌, అంత‌ర్జాతీయంగా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ఇన్నోవేటివ్ సొల్యూష‌న్స్ వెత‌కాల్సి ఉంది” అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సరైన పద్ధతి లేకుండానే ఒక ఆస్తి విలువను ఊహాజనితంగా నిర్ధారించడం జూదం వంటిదే అని ఆయన అన్నారు. వివిధ వాటాదారులు, సంస్థల నుండి ఇన్‌పుట్లను సేకరించిన తర్వాత క్రిప్టో కరెన్సీపై సరైన వైఖరిని ఖరారు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ ప్రభావంతో తలెత్తే యుద్ధాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు శక్తికాంత దాస్. అంతేకాదు అనుకోని ఉపద్రవాలను, ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా అనంతరం పునరుజ్జీవన బాటలో ఉందని వెల్లడించారు.

Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్.. మహిళ నుంచి రూ.10లక్షలు కొట్టేశారు

గురువారం ఆర్బీఐ ఆర్థిక సుస్థిర‌త నివేదికను శక్తికాంత దాస్ విడుదల చేశారు. కాగా, క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డులు మ‌దుపు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న త‌రుచుగా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.