CISR: శాస్త్రవేత్తల ఉన్నత విభాగానికి మొదటిసారి మహిళా బాస్

సీఎస్ఐఆర్‭ డైరెక్టర్‭గా అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని అంటున్నారు. ఆమె ఇదే సంస్థలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలక్ట్రో కెమికల్ సిస్టమ్స్ మీద ఆమెకు 25 ఏళ్ల అనుభవం ఉంది. లిథియం, లిథియం బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్లు, శక్తి నిల్వ, ఎలక్ట్రోక్యాటలిటిక్ అప్లికేషన్‌ల కోసం వేస్ట్-టు-వెల్త్ నడిచే ఎలక్ట్రోడ్‌లు, ఎలక్ట్రోలైట్‌లపై కళైసెల్వికి ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు సహ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఎలెక్ట్రిక్ మొబిలిటీకి విశేష కృషి చేసిన ఆమె తన కెరీర్‭లో 125 రీసెర్చ్ పేపర్లు అందించడంతో పాటు, ఆరు పేటెంట్లు పొందారు.

CISR: శాస్త్రవేత్తల ఉన్నత విభాగానికి మొదటిసారి మహిళా బాస్

CSIR gets first woman boss

CISR: శాస్త్రవేత్తల ఉన్నత విభాగమైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు మొట్టమొదటిసారి ఒక మహిళా అధినేతగా నియామకమయ్యారు. సీఎస్ఐఆర్‭ డైరెక్టర్‭గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కళైసెల్విని నియమిస్తున్నట్లు కేబినెట్ నియామకాల కమిటి తాజాగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సీఐఎస్ఆర్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఎస్ఐఆర్‭ డైరెక్టర్‭తో పాటు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కేంద్ర సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగానికి కార్యదర్శిగా కూడా కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా 38 రీసెర్చ్ సెంటర్లు ఉన్న సీఐఎస్ఆర్‪‭కు ఇంతకు ముందు వరకు శేఖర్ మండే డైరెక్టర్‭గా పని చేశారు.

2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‭కి సారథ్యం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా కళైసెల్వి రికార్డు సృష్టించారు. అందే సీఎస్ఐఆర్‭ డైరెక్టర్‭గా అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని అంటున్నారు. ఆమె ఇదే సంస్థలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలక్ట్రో కెమికల్ సిస్టమ్స్ మీద ఆమెకు 25 ఏళ్ల అనుభవం ఉంది. లిథియం, లిథియం బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్లు, శక్తి నిల్వ, ఎలక్ట్రోక్యాటలిటిక్ అప్లికేషన్‌ల కోసం వేస్ట్-టు-వెల్త్ నడిచే ఎలక్ట్రోడ్‌లు, ఎలక్ట్రోలైట్‌లపై కళైసెల్వికి ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు సహ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఎలెక్ట్రిక్ మొబిలిటీకి విశేష కృషి చేసిన ఆమె తన కెరీర్‭లో 125 రీసెర్చ్ పేపర్లు అందించడంతో పాటు, ఆరు పేటెంట్లు పొందారు.

NITI Aayog meeting: కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంసలు