Manipur Violance: నెల రోజులకు కాస్తంత ఊపిరి పీల్చుకున్న మణిపూర్.. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హింసాత్మక అల్లర్లపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు

Manipur Violance: నెల రోజులకు కాస్తంత ఊపిరి పీల్చుకున్న మణిపూర్.. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

Street in Imphal

Curfew Lift: నెల రోజులకు పైగా అల్లర్లు, హింసతో అట్టుడికిపోతున్న మణిపూర్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చర్యల ఫలితమో, మరింకేదో తెలియదు కానీ రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం కొంత శాంతించింది. దీంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూని సడలించారు. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్‌ జిల్లాల్లో కర్ఫ్యూ 12 గంటల పాటు (ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య) సడలించారు. ఇక జిరిబామ్‌లో ఎనిమిది గంటలు (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య); తౌబల్, కక్చింగ్‌ జిల్లాల్లో ఏడు గంటలు (ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య) కర్ఫ్యూ సడలించారు.

Mayawati: కాంగ్రెస్ ‘ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్’ పథకాలపై విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్ మాయావతి

చురచంద్‌పూర్, చందేల్‌ జిల్లాల్లో 10 గంటలు (ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య); తెంగ్నౌపాల్‌లో ఎనిమిది గంటలు (ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు); కాంగ్‌పోక్పిలో 11 గంటలు (ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు); ఫెర్జాల్‌లో 12 గంటలు (ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు) సడలింపు చేశారు. తమెంగ్‌లాంగ్, నోనీ, సేనాపతి, ఉఖ్రుల్ కామ్‌జోంగ్‌లలో కర్ఫ్యూ లేదని మణిపూర్ పోలీసులు తెలిపారు.

Caste System: గతంలో కులవివక్ష లేదనడం అబద్ధం, జరిగిన అన్యాయాన్ని అంగీకరించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

రాష్ట్రంలో రిజర్వేషన్ల విషయమై ఇరు వర్గాల మధ్య రేగిన వివాదం ఒకటి కాగా, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్ చేయబడిన, రక్షిత అటవీ ప్రాంతాలను సర్వే చేయడంపై మరొక వివాదం తలెత్తాయి. దీంతో రాష్ట్రంలో నెల రోజులకు పైగా తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఒకానొక సమయంలో కనిపిస్తే కాల్చిపారేయమంటూ ఆదేశాలు జారీ చేసింది.

Manipur: బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గిరిజనుల ఆగ్రహం.. ఏకంగా సీఎం పాల్గొనే సమావేశానికే నిప్పు, ఉద్రిక్త పరిస్థితులు

ఇక రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హింసాత్మక అల్లర్లపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా, చట్టబద్ధంగా పూర్తి నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగుతుందని మణిపూర్ ప్రజలకు తాను తెలియజేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.