McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్‌లెట్ సీజ్

కూల్ డ్రింక్‌లో ఐస్ ముక్కలు ఉండగా..ఆ ముక్కలను కదిలించిన యువకుడు..ఐస్ ముక్కల మధ్యలోనుంచి ఒక చచ్చిన బల్లి పైకి తేలడం గమనించి నిర్ఖంత పోయాడు.

McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్‌లెట్ సీజ్

Mc

McDonald Customer: రెస్టారెంట్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లు వినియోగదారుల ఆరోగ్యంతో ఎంతలా చెలగాటం ఆడుతున్నాయో తెలిపే ఘటన ఇది. వినియోగదారులు కాస్త ఏమరపాటుగా ఉన్నా..అనారోగ్యాలను కొని తెచుకోవాల్సిందే. సరదాగా స్నేహితులతో కలిసి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్, కూల్ డ్రింక్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు స్టోర్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే..భార్గవ్ జోషి అనే యువకుడు తన మిత్రులతో కలిసి మే 21న అహ్మదాబాద్ నగరంలోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కి వెళ్ళాడు. స్నేహితులంతా కలిసి ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేశారు. అనంతరం మెక్ డొనాల్డ్ సిబ్బంది ఆర్డర్ సర్వ్ చేయగా..భార్గవ్ స్నేహితుడు కూల్ డ్రింక్ అందుకుని కొద్దిగా సేవించాడు. కూల్ డ్రింక్‌లో ఐస్ ముక్కలు ఉండగా..ఆ ముక్కలను కదిలించిన యువకుడు..ఐస్ ముక్కల మధ్యలోనుంచి ఒక చచ్చిన బల్లి పైకి తేలడం గమనించి నిర్ఖంత పోయాడు.

వెంటనే ఈ విషయాన్నీ రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా..వారు స్పందించలేదు. కూల్ డ్రింక్‌లో బల్లి రావడంపై సిబ్బందిని ప్రశ్నించగా ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. దాదాపు నాలుగంటల పాటు భార్గవ్ జోషి అతని స్నేహితులు..అక్కడే కూర్చుని మెక్ డొనాల్డ్ సిబ్బంది పై వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది స్పందించి భార్గవ్ జోషి చెలించిన బిల్లు డబ్బులు రూ.300లను వెనక్కు ఇచ్చేశారు. అయితే సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్గవ్..ఒక మనిషి ప్రాణం ఖరీదు రూ.300లా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ జరిగిన తతంగాన్ని భార్గవ్ వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయగా..అది చూసిన నెటిజన్లు మెక్ డోనాల్డ్ రెస్టారెంట్ నిర్లక్ష్యం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

other stories:Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత

భార్గవ్ జోషికి మద్దతుగా నిలిచారు నెటిజెన్లు. ఇక అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌లో కూల్ డ్రింక్‌లో బల్లి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవగా..స్పందించిన స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులు..బుధవారం ఆ అవుట్ లెట్‌ను సీజ్ చేశారు. దీనిపై మెక్ డొనాల్డ్ సంస్థ స్పందిస్తూ..నాణ్యత, సేవ, శుభ్రత మరియు విలువ మా వ్యాపార కార్యకలాపాలలో ప్రధానమైనవిగా చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ అవుట్ లెట్‌లో జరిగిన ఘటనలో తమ వైపు నుంచి ఎటువంటి తప్పులేదని అయినా స్థానిక అధికారుల విచారణకు తాము సహకరిస్తామని సంస్థ తెలిపింది.