Cyber Attacks : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా భారత వెబ్‌సైట్లపై సైబర్‌ దాడులు

భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను హ్యాక్‌కు గురయ్యాయి. డ్రాగన్‌ఫోర్స్‌, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్‌ కోరడర్స్‌ పేరుతో హ్యా్‌క్‌ అయ్యాయి.

Cyber Attacks : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా భారత వెబ్‌సైట్లపై సైబర్‌ దాడులు

Cyber Attack

Cyber attack websites : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతోంది. వాళ్లిద్దరి వ్యాఖ్యలకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్స్‌ భారత్‌పై సైబర్ దాడులు చేయడం మెదలు పెట్టారు. కొన్ని గంటలుగా దేశంలో 70కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వెబ్‌సైట్స్‌, పోర్టర్స్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్ అగ్రికర్చర్ రీసెర్చ్‌తో పాటు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెబ్‌సైట్స్‌కు కూడా హ్యాక్ అయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 50కిపైగా సంస్థలు హ్యాకింగ్‌కు గురయ్యాయి.

వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసిన తర్వాత మీ కోసం మీ మతం.. మాకు మా మతం అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు. భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను హ్యాక్‌కు గురయ్యాయి. డ్రాగన్‌ఫోర్స్‌, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్‌ కోరడర్స్‌ పేరుతో హ్యా్‌క్‌ అయ్యాయి. అలాగే హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్‌ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పోర్టల్స్‌ హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా కొన్ని బ్యాంకింగ్‌ వెబ్‌సైట్లు కూడా హ్యాక్‌కు గురయ్యాయి.

GULF Contries serious on India :బీజేపీ నేతల వ్యాఖ్యలతో ప్రమాదంలో భారత ఆర్ధిక వ్యవస్థ..ఆంక్షల దిశగా 15 ముస్లిం దేశాలు

కాగా, మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత్‌పై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అల్‌ఖైదా ఉగర్వాద సంస్థ బెదిరింపులకు పాల్పడింది. దీంతో తాజాగా భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల వెబ్‌సైట్‌లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఒక్క మహారాష్ట్రలోని 50 పైగా కంపెనీలు హ్యాక్‌కు గురైనట్లు సమాచారం. అలాగే జూన్‌ 8 నుంచి 12వ తేదీ మధ్య భారత ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్లతో పాటు ప్రైవేటు కంపెనీల పోర్టల్స్‌ హ్యాక్‌ అయినట్లు సమాచారం.