SBI KYC : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులతో జాగ్రత్త.. ఇలా రిపోర్ట్ చేయండి..

ఎస్‌బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని

SBI KYC : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులతో జాగ్రత్త.. ఇలా రిపోర్ట్ చేయండి..

Sbi Kyc

SBI KYC : దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌ మోసాల పట్ల ఎప్పటికప్పుడు తన కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఉంటుంది. సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతుంది. వారి చేతిలో మోసపోకుండా సూచనలు చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఖాతాదారులను మరో ఆన్ లైన్ మోసం గురించి అలర్ట్ చేసింది ఎస్బీఐ. కేర్ ఫుల్ గా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.

Jio Users : జియో యూజర్లు రీచార్జీ తేదీ మరిచిపోయారా? నో ప్రాబ్లమ్

నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. ఎస్‌బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు.

ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్త ఉండాలని ఎస్బీఐ సూచించింది. మోస‌గాళ్లు ఈ నకిలీ లింక్స్ సాయంతో వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని చెప్పింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ చెందిన ఒక యువకుడు అలాంటి లింక్ మీద క్లిక్ చేసి రూ.10వేలు పొగొట్టుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందుకే, ఇలాంటి నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన కస్టమర్లను ఎస్బీఐ సూచించింది.

Fresh Meat : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?

మోసాల బారిన పడకుండా ఎస్బీఐ సూచనలు:
* ఏదైనా లింక్‌ను క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.
* కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించ‌దన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
* మీ మొబైల్ నంబర్‌, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.
* నకిలీ లింక్స్ యుఆర్ఎల్ లో బ్యాంక్ పేరు ఉండదు.

ఇలా ఫిర్యాదు చేయండి..
* తమ బ్యాంక్ ఖాతాలో అన‌ధికార లావాదేవీలు జ‌రిగితే ఖాతాదారులు వెంట‌నే బ్యాంకుకి నివేదించాలి.
* ఇలాంటి లావాదేవీల‌ను గుర్తించిన వెంట‌నే 1800 425 3800, 1800 112 211 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి.
* బ్యాంకు వర్గాలు సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్తాయి.