ఫోని తుపాన్ ఎఫెక్ట్: 223 రైళ్లు రద్దు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

  • Published By: vamsi ,Published On : May 3, 2019 / 02:27 AM IST
ఫోని తుపాన్ ఎఫెక్ట్: 223 రైళ్లు రద్దు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

ఫోని తుపాన్ నేపథ్యంలో ఒడిశా, కోల్‌కతా, చెన్నై సముద్రతీరంలోని ప్రాంతాల్లో 223 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 140 ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు 83 ప్యాసింజరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలోని భాద్రక్-విజయనగరం, కోల్‌కతా- చెన్నై రైలు మార్గాల్లో మే 4వతేదీ వరకు రైళ్లను రద్దు చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించారు.

మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా అలర్ట్ అయ్యింది.  సికింద్రాబాద్‌, విజయవాడ డివిజన్‌ కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. విజయవాడ-విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య నడిచే కొన్ని రైళ్లను రద్దు చేశారు. ట్రాక్ వెంట గస్తీ పెంచాలని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా స్టేషన్‌లో ఆహారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే  పలు స్టేషన్లలో హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు అధికారులు.

రైల్వేస్టేషన్‌    – ఫోన్‌ నంబర్లు
 

విశాఖపట్నం:

08912744619, 08912746338, 08912746344, 8500041670/71/72/73, 8106053051, 8106052643, 8106053052, 8106053109

విజయనగరం: 
08922221202, 08922221206, 8500358610, 8500358712, 8106052987, 8106053006

శ్రీకాకుళం:
08942286213, 08942286245, 8500359367, 8500358746, 8106052901, 8106052958