మూడు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న తుపాను ముప్పు

  • Published By: murthy ,Published On : November 23, 2020 / 07:30 AM IST
మూడు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న తుపాను ముప్పు

Puducherrycyclone warning for three states : ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది.

ఈ తుఫానుకు నివర్‌ అని పేరు పెట్టారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి, ఈనెల 25న మధ్యాహ్నం పుదుచ్చేరి-మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది.నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నేడు, రేపు ఏపీలో ఉరుములతో వర్షాలు, ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.



25, 26 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రధానంగా నెల్లూరు నుంచి గుంటూరు వరకు అక్కడక్కడ అసాధారణ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 25, 26 తేదీల్లో తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 24, 25 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది..
https://10tv.in/tunnel-detected-in-jks-samba-suspected-to-have-been-used-by-4-jaish-terrorists-to-sneak-from-pakistan/
మత్స్యకారులు ఈనెల 25వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లిన వారంతా వెంటనే వెనక్కి వచ్చేయాలని ఐఎండీ సూచించింది. మరోవైపు అరేబియా సముద్రంలోని గతి తుఫాను భారతదేశం వైపు కదులుతోంది. ప్రస్తుతం ఇది యెమన్‌కు దక్షిణాన 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-నైరుతి దిశగా కదులుతోంది.