Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, ‘టాటా సన్స్’ గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్రలోని పాల్‪ఘర్ వద్ద, ఆదివారం మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హఠాన్మరణం

Cyrus Mistry: ‘టాటా సన్స్’ గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా, మహారాష్ట్రలోని పాల్‪ఘర్ వద్ద, ఆదివారం మధ్యాహ్నం 3.35కు జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు చరోటి ప్రాంతంలో సూర్య నదిపై డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టింది.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

 

 

ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు జహంగీర్ దిన్ షా పండోలే అనే మరొకరు కూడా మరణించినట్లు సమాచారం. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కారు నడిపింది డాక్టర్ అనహితా పండోలే. ఇదే ప్రమాదంలో మరణించిన జహంగీర్ భార్య ఆమె. కారు అధిక వేగంతో వెళ్లడం వల్లే, అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ‘ఎమ్‌హెచ్ 47 ఏబీ-6705’. ఈ కారు జేఎమ్ ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌ పేరిట ఉంది. సైరస్ మిస్త్రీకి ఇద్దరు కుమారులు.

Cyrus Mistry

మిస్త్రీ నిజానికి ఐరిష్ పౌరుడు. ఆయనకు ఐరిష్ పౌరసత్వమే ఉంది. కాగా, సైరస్ మిస్త్రీ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.