Covid Cases : భారత్‌లో నిన్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ స్టేటస్ ఇదీ

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 267 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరువయ్యాయి.

Covid Cases :  భారత్‌లో నిన్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ స్టేటస్ ఇదీ

India Corona

Covid Cases :  దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 267 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరువయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 12,516 కరోనా కేసులు నమోదు కాగా ఇదే సమయంలో 501మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,37,416 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చదవండి : AP Corona : ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో

ఇక కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో 3,44,14,186 కేసులు నమోదు కాగా, 4,62,690 మంది మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.26 శాతంగా ఉంది. 2020 మార్చి తర్వాత రికవరీ కేసుల శాతం భారీగా పెరిగింది. శుక్రవారం 13,155 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,14,080 చేరింది.

చదవండి : AP Corona : ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో

ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే..

భారత్‌లో 300 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 110.79 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణి చేశారు. దేశంలోని అనేక గ్రామాలు 100శాతం వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నాయి. గురువారం ఒక్కరోజే 53,81,889 డోసుల వ్యాక్సిన్ అందచేశారు.