India Covid : మరో వారం ముప్పే..మరణాలు..కేసుల పెరుగుదల షాకింగ్ న్యూస్

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్‌ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.

India Covid : మరో వారం ముప్పే..మరణాలు..కేసుల పెరుగుదల షాకింగ్ న్యూస్

Covid 19

Covid Deaths : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్‌ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు. కరోనా మరణాల సంఖ్య మరో వారం రోజులు ఇలానే కొనసాగతుందంటూ తేల్చిచెప్పారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పీక్ దశ ముగిసింది. మరికొన్ని రాష్ట్రాలలో పీక్‌ దశ రావాల్సి ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. వారి లెక్కల ప్రకారం రానున్న రోజుల్లో తమిళనాడు, పంజాబ్, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరిలో కరోనా పీక్‌ స్థాయికి చేరుకుంటుందని అంచనా. వచ్చే 6 నుంచి 8 నెలల్లో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ కల్లోలం సృష్టించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గోవాలో ప్రస్తుతానికి కరోనా పీక్‌ దశ ముగిసినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పంజాబ్, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా పీక్‌ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. తమిళనాడులో మే 29-31, పుదుచ్చేరిలో మే 19, 20 తేదీలు, అసోంలో మే 20, 21 తేదీల మధ్య కరోనా పీక్‌ చేరుకునే అవకాశం ఉంది. పంజాబ్‌లో మే 22, హిమాచల్‌ ప్రదేశ్‌లో మే 24 కరోనా తారాస్థాయికి చేరుకోనుంది.

దేశ వ్యాప్తంగా మే చివరి నాటికి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని కాన్పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్ మనీందర్‌ అగ్రవాల్‌ చెప్పారు. మే చివరి నాటికి ప్రతిరోజు 1.5 లక్షల కేసులు నమోదవుతాయని…. జూన్‌లో ఆ సంఖ్య 20 వేలకు తగ్గుతుందన్నారు. జులైలో కరోనా రెండోవేవ్ ముగిసిపోతుంది. 6 నెలల తర్వాత మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని ఐఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More :  India Covid 3rd Wave : జూలైలో కొవిడ్‌ సెకండ్ వేవ్ అంతం.. థర్డ వేవ్ ఎప్పుడంటే?