Coimbatore : కులం పేరిట..కోయంబత్తూరులో ‘నారప్ప’ సీన్, కాళ్లు మొక్కిన ప్రభుత్వ ఉద్యోగి

కోయంబత్తూర్‌లోని అన్నూర్‌ పంచాయితీలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామిని.. కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. తన భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లిన గోపాలస్వామి అనే వ్యక్తి.. అక్కడ మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు.

Coimbatore : కులం పేరిట..కోయంబత్తూరులో ‘నారప్ప’ సీన్, కాళ్లు మొక్కిన ప్రభుత్వ ఉద్యోగి

Tamilnadu

Dalit Govt Employee : సమాజంలో దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. ఎక్కడో ఒక చోట..కులం పేరిట వారిని దూరం నెట్టేస్తున్నారు. కులం పేరిట దూషిస్తూ…వారి చేత దారుణ పనులు చేయిస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడం, వారికి జరిమానలు విధించడం..వివిధ శిక్షలు వేస్తున్న ఘటనలు చూస్తుంటాం. అయితే..ఓ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగి చేత కాళ్లు మొక్కించుకున్నాడు. దీనిపై దుమారం చెలరేగుతోంది.

తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని అవమానించారు. కోయంబత్తూర్‌లోని అన్నూర్‌ పంచాయితీలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామిని.. కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌..విచారణకు ఆదేశించారు.

Read More : Olympic Medal Winners: ఇండియన్ ఒలింపిక్ మెడల్ విజేతలకు ఫ్రీ ట్రావెల్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్

భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లిన గోపాలస్వామి అనే వ్యక్తి.. అక్కడ మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు. ఈ వ్యవహారంలో ముత్తుస్వామి, గోపాలస్వామి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో.. ముత్తుస్వామి దళితుడని కులం పేరుతో అవమానించాడు గోపాలస్వామి. తన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే తన పలుకుబడితో ఉద్యోగం తీసేయిస్తానని బెదిరించాడు. దీంతో అతని కాళ్ళమీద పడి క్షమాపణ చెప్పాడు ముత్తుస్వామి.