Kollam – Chennai Egmore Express: కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పగుళ్లు.. రైల్వే సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం..

కొల్లాం - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో కొల్లం జంక్షన్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌ చక్రాలపైన పగుళ్లు వచ్చాయి.

Kollam – Chennai Egmore Express: కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పగుళ్లు.. రైల్వే సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం..

Kollam - Chennai Egmore Express

Kollam – Chennai Express: ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతుంది. ఈ ఘోర ప్రమాదంకు సంబంధించిన దృశ్యాలు కళ్లముందే కదలాడుతున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 290 మంది మరణించారు. మరో వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో 100 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వే చరిత్రలోనే బాలాసోర్‌లోని రైలు ప్రమాదం పెద్దదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘోర ప్రమాదం నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం తృటిలో తప్పిపోయింది. దీంతో రైల్వే ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Odisha Train Accident : సిగ్నల్ సిస్టమ్‌ను మార్చినట్లు గుర్తించిన రైల్వే శాఖ

కొల్లాం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో కొల్లాం – చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌ చక్రంలో పగుళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ రైల్వే ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 3.36 గంటల సమయంలో రైలు (నెంబర్ 16102) షెంగోట్టై రైల్వే స్టేషన్ లో ఆగింది.

CBI Investigation : రైల్వే సిబ్బంది పనేనా? లేక బయటివారి పనా?

రైలు ఎస్-3 కోచ్‌ చక్రాలపైన అండర్ ఛాసిస్‌లో పగళ్లు ఏర్పడినట్లు రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తరువాత ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించి దెబ్బతిన్న బోగీని వేరు చేయడంతో సాయంత్రం 4.40 గంటలకు రైలు ప్రయాణాన్ని ప్రారంభించారు. రైలు మదురై చేరుకున్నప్పుడు ప్రత్యేక కోచ్‌ను జోడించారు. ఇదిలాఉంటే రైల్వేస్ ప్రకారం.. పగుళ్లను గుర్తించిన సిబ్బందిని రైల్వే అధికారులు ప్రశంసించారు. అయితే, వారికి మధురై డివిజన్ రైల్వే మేనేజర్ సోమవారం భద్రతా సమావేశంలో సిబ్బందికి అవార్డును అందజేయనున్నారు.