Dance : పియా తు అబ్ తో ఆజా, బామ్మలు వేసిన డ్యాన్స్..నెటిజన్లు ఫిదా..

ఇద్దరు బామ్మలు వేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ కితాబిస్తున్నారు.

Dance : పియా తు అబ్ తో ఆజా, బామ్మలు వేసిన డ్యాన్స్..నెటిజన్లు ఫిదా..

Dance

Elderly Women : వయస్సు దేనికి అడ్డం కాదు. సంతోషం ఉన్నప్పుడు చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా ఎంజాయ్ చేస్తుంటారు. డ్యాన్స్ లు చేస్తుంటారు. వారి సంతోషానికి అవధులు ఉండవు. ఇందులో ప్రధానం వృద్ధులు. వయస్సు మీద పడినా..వారు చేస్తున్న పనులు అందర్నీ ఆశ్చర్యపడేస్తుంటాయి. ఇలాగే ఇద్దరు బామ్మలు వేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ కితాబిస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి..వాళ్లు వేసిన స్టెప్స్ అదరహో లాగా ఉన్నాయి.

ఓ ప్రాంతంలో ఇద్దరు బామ్మలు..డ్యాన్స్ చేస్తున్నారు. ఇండియన్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఆశా భోస్లే సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘పియా తు అబ్ తో ఆజా’ పాటకు వారు వేసిన స్టెప్స్‌ వావ్ అనిపిస్తున్నాయి. యూత్ చేసిన విధంగా వాళ్లు కాళ్లు కదుపుతూ..నడుము ఊపుతూ..డ్యాన్స్ వేశారు. ప్రపంచాన్ని మరిచిపోయి ఆ పాటను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేశారు. రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి నెటింట్లో పెట్టేశాడు. ఇంకేముంది తెగ వైరల్ గా మారిపోయింది.

Read More : Mumbai : మీ వద్ద కరోనా మందులు మిగిలిపోయాయా ? మాకివ్వండి..మేము తీసుకుంటాం