బారాత్‌ డ్యాన్స్ : డ్రైనేజీలో పడిన పెళ్లికొడుకు

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 03:16 AM IST
బారాత్‌ డ్యాన్స్ : డ్రైనేజీలో పడిన పెళ్లికొడుకు

ఢిల్లీ : మస్త్‌గా మస్త్‌గా పెళ్లి చేసుకోవాలని..ఇది గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటుంటారు. కొంతమంది వినూత్నంగా..మరికొంత మంది ఆర్భాటంగా..ఇంకొంత మంది సాదాసీదాగా చేసుకుంటుంటారు. అయితే..ఓ పెళ్లికొడుకు మాత్రం తన పెళ్లిలో జరిగిన ఘటన జీవితంలో మరిచిపోలేడు. ఎందుకంటే…బారాత్‌‌లో బంధువులు బీభత్సమైన డ్యాన్స్‌కి పెళ్లికొడుకు డ్రైనేజీలో పడాల్సి వచ్చింది. అప్పటి వరకు కలర్ ఫుల్‌గా మెరిసిపోయిన ఆ వరుడు మురుగునీరు అంటుకున్న డ్రెస్‌తో కనిపించాడు. అసలు డ్యాన్స్ ఆడితే పెళ్లికొడుకు డ్రైనేజీలో పడడం ఏంటీ అని అనుకుంటున్నారా ? పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది చదవండి…

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త 32 ఏళ్ల సోనమ్‌కి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 9వ తేదీన నోయిడాలోని సెక్టార్ 52లో హోషియార్‌పూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగనుంది. అందుకు వధువు తరపు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. నోయిడాలోని సెక్టార్ 52లో హోషియార్‌పూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకుని..పెళ్లి కుమార్తె వారు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా బారాత్ నిర్వహించారు. బంధువులు..ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా డ్యాన్స్‌లు చేశారు. ఫంక్షన్ హాల్..రోడ్డుకు మధ్య ఓ మురుగునీటి కాల్వ ఉంది. దానిపై ఓ చిన్నపాటి బ్రిడ్జి ఉంది. 

బ్రిడ్జీకి అవతలి వైపున వధువు తల్లిదండ్రులు, ఇతరులు వరుడికి వెల్ కమ్ చెప్పేందుకు నిలబడ్డారు. బ్రిడ్జీపై నిలబడి కొంతమంది డ్యాన్స్ చేశారు. ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది. పెళ్లికొడుకు..12 మంది డ్రైనేజీలో పడిపోయారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అందరూ షాక్‌కి గురయ్యారు. వెంటనే వారినందరినీ పైకి లేపారు. చిన్నారులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

అయితే దీనిపై పెళ్లి తరపు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని సరిగ్గా బ్రిడ్జీ కట్టలేదని..తమకు పరిహారం ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. మురుగునీటిలో పడడంతో బంగారు ఆభరణాలు…సెల్ ఫోన్‌లు పోయాయని వారు పేర్కొన్నారు. పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకున్నారు. వధువు తరపు వారు ఇచ్చిన రూ. 3 లక్షలను వెనక్కిచ్చేందుకు ఫంక్షన్ హాల్ ఓనర్ అంగీకరించారు. మరలా ఫ్రెష్‌గా స్నానం చేసి పెళ్లికొడుకు పెళ్లి పీఠలపై ఎక్కాడు. తాను సుమారు 15 ఏళ్ల నుండి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నానని..ఎప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని యజమాని వెల్లడించాడు.