కారు టాప్ తీసి వధువు డ్యాన్స్.. తర్వాత

కారు టాప్ తీసి వధువు డ్యాన్స్.. తర్వాత

Dancing bride : కొద్ది గంటల్లో పెళ్లి..అంతటా సంతోష వాతావరణం నెలకొంది. వధువు, వరుడు కుటుంబసభ్యులతో సందడి సందడి నెలకొంది. కానీ..అంతలోనే విషాదం నెలకొంది. పెళ్లి మండపానికి వస్తున్న వధువు కారులో నుంచే డ్యాన్స్ చేస్తుండగా..ఇతరులు కూడా డ్యాన్స్ చేశారు. అంతలో ఓ కారు వారిపైకి వేగంగా దూసుకరావడంతో ఒకరు చనిపోయారు. దీంతో పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో నైమండీ ప్రాంతంలో అంకుర్ అనే వ్యక్తితో హేమ అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. 2021, ఫిబ్రవరి 16వ తేదీ మంగళవారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

డెహ్రాడూన్ హైవే నుంచి నైమండీ ప్రాంతానికి కారులో వధువును తీసుకొస్తున్నారు. వివాహ వేడుక ప్రాంతానికి చేరుకున్న అనంతరం వధువు..కారు టాప్ ను తీసి..పైకి లేచింది. పెళ్లి దుస్తులు, కళ్లద్దాలు ధరించి..మెరిసిపోతున్న వధువు..మెల్లిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అక్కడనే ఉన్న బంధువులు కూడా కారు పక్కనే నిల్చొని డ్యాన్స్ చేశారు. కారు ప్రధాన రహదారి పక్కనే వస్తుండడంతో ఇతరులకు ఇబ్బంది కలిగింది. ఇంతలో అతివేగంగా వెళుతున్న ఓ కారు వారి మీదకు దూసుకొచ్చింది. వధువు కారు పక్కన నిలబడిన వారిని ఢీకొట్టింది. వరుడి బంధువు ఒకరు చనిపోయారు. పదుల సంఖ్యలో అతిథులకు తీవ్రగాయాలయ్యాయి. వధువు తృటిలో తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.