జమ్ములో టెన్షన్ : ఓటరు డ్యాన్స్.. పోలింగ్ సందడి 

ఎప్పుడు ఉద్రిక్తతలు, భద్రతా అవరోధాలతో బిక్కుబిక్కుమని గడిపే జమ్మూకశ్మీర్ ప్రజలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కాస్తా హుషారుగా కనిపించారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 08:14 AM IST
జమ్ములో టెన్షన్ : ఓటరు డ్యాన్స్.. పోలింగ్ సందడి 

ఎప్పుడు ఉద్రిక్తతలు, భద్రతా అవరోధాలతో బిక్కుబిక్కుమని గడిపే జమ్మూకశ్మీర్ ప్రజలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కాస్తా హుషారుగా కనిపించారు.

శ్రీనగర్ : ఎప్పుడు ఉద్రిక్తతలు, భద్రతా అవరోధాలతో బిక్కుబిక్కుమని గడిపే జమ్మూకశ్మీర్ ప్రజలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కాస్తా హుషారుగా కనిపించారు. ఉత్తర కశ్మీర్ లోని బారముల్ల జిల్లా లోక్ సభ నియోజకవర్గంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ కు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బందిపొరా ప్రాంతానికి చెందిన ఒక ఓటరు పోలింగ్ బూత్ దగ్గర ఆనందంతో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

మిగతా ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలో నిలబడితే.. ఈ ఓటర్ మాత్రం సింపుల్ గా షర్ట్ పై స్వెట్టర్ ధరించి ఎలాంటి భయం లేకుండా సంతోషంతో చిందులు వేశాడు. దీంతో అప్పటివరకూ దిగులుగా ఉన్న ఓటర్ల ముఖంలో చిరునవ్వు కనిపించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 2వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలామంది నెటిజన్లు ఈ వీడియోను రీట్వీట్లు చేశారు. ఈ వీడియోలో చిందేసిన ఓటరు.. తన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపించాడు. 

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతుండగా… మరోవైపు వేర్పాటు వాదులు అసెంబ్లీ ఎన్నికలను బైకాట్ చేయడంతో కొంత సమయం వరకు పోలింగ్ సస్పెండ్ చేశారు. ఏప్రిల్ 11, 2019 ఉదయం 11 గంటల వరకు 24 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో బారముల్ల లోక్ సభ నియోజవర్గం ఎన్నికలపై అందరి దృష్టి పడింది. ఈ నియోజక వర్గం నుంచి జుగల్ కిషోర్ శర్మ (బీజేపీ), రామన్ భల్లా (కాంగ్రెస్) ప్రధాన అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

ఈ ఎన్నికల తర్వాత జమ్మ కశ్మీర్ ప్రాంతంలో పరిస్థితి మారుతుందని అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 నియోజకవర్గాలకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి.