దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది

  • Published By: vamsi ,Published On : September 12, 2019 / 09:35 AM IST
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది

మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ప్రజలు నమ్మకం పెట్టుకుని ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభుత్వం దారుణంగా దుర్వినియోగం చేస్తుందని ఆమె ఆరోపించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని.. అన్నీ రంగాల్లో నష్టాలు పెరిగి గతంలో ఎప్పుడూ లేని పరిస్థితిలో దేశం పడిపోయిందని ఆమె అన్నారు.

దేశ ఆర్థిక పరిస్థితి నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఆమె ఆరోపించారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, అంబేడ్కర్ వంటి మహానీయుల సందేశాలను వక్రీకరిస్తూ తమ ఎజెండా కోసం బీజేపీ వాడుకుంటుందని ఆమె విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైన సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎజెండా ఉండాలంటూ దిశానిర్ధేశం చేశారు.

కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటే సరిపోదని, ప్రజలకు-కాంగ్రెస్‌కు మధ్య ఉన్న కొంత గ్యాప్ ని తగ్గించాలని, అందుకోసం ప్రజల్లోకి వెళ్లాలని కీలకం అని అన్నారు. ఇది మన శక్తియుక్తులకు ఒక పరీక్ష లాంటిది అని పార్టీకి ఇప్పుడు అటువంటిది పార్టీకి చాలా అవసరం అని ఆమె వారికి చెప్పారు.