Danish PM : తాజ్‌మహల్‌ని సందర్శించిన డెన్మార్క్ ప్రధాని

భారత పర్యటనలో ఉన్న డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్(43)..తన భర్త బో టెంగ్‌బర్గ్‌తో కలిసి ఆదివారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ ప్రదేశం అద్భుతంగామ ఉందని డానిష్ ప్రధాని

Danish PM :  తాజ్‌మహల్‌ని సందర్శించిన డెన్మార్క్ ప్రధాని

Den2

Danish PM భారత పర్యటనలో ఉన్న డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్(43)..తన భర్త బో టెంగ్‌బర్గ్‌తో కలిసి ఆదివారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ ప్రదేశం అద్భుతంగామ ఉందని డానిష్ ప్రధాని పేర్కొన్నారు.

శనివారం రాత్రి 8:30గంటలకు తన భర్తతో కలిసి ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న డెన్మార్మ్ ప్రధానికి యూపీ ఇంధనశాఖ మంత్రి కాంత్ శర్మ ఘనస్వాగతం పలికారు. శనివారం రాత్రి ఆగ్రాలోని హోటల్ అమర్ విలాస్ లో ప్రధాని దంపతులు బస చేశారు. ఆదివారం ఉదయం ప్రధాని,ఆమె భర్త ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లో తాజ్ మహల్ దగ్గరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు ప్రదర్శనలతో వారికి ఘన స్వాగతం పలికారు. గంటన్నరకుపైగా తాజ్‌మహల్‌లో డానిష్‌ ప్రధాని దంపతులు ఉండగా.. గైడ్‌ వారికి తాజ్‌ మహల్‌ గురించి వివరించారు. ఆ తర్వాత ప్రధాని సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి.. ఈ ప్రదేశం అందంగా ఉంది అని పేర్కొన్నారు.

Den

Den23

తాజ్ సందర్శన తర్వాత ఆగ్రా కోటకు చేరుకున్నారు ప్రధాని దంపతులు. ఉదయం 10:50గంటలకు ఆగ్రా కోటకు చేరుకున్న డెన్మార్క్ ప్రధాని దంపతులు..11:50వరకు అక్కడే ఉన్నారు. గంట సమయం ఆగ్నా కోటలో ఉన్నారు ప్రధాని దంపతులకు.. గైడ్ ఆగ్రా కోట విశేషాలను వివరించారు. కాగా,డెన్మార్క్ ప్రధాని ఆగ్రా పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్‌, ఆగ్రా కోటను రెండు గంటల పాటు మూసివేసినట్లు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా,ఆగ్రా సర్కిల్ అధికారులు తెలిపారు.

కాగా, గతేడాది డెన్మార్క్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా మెట్టే ఫ్రెడెరిక్సెన్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కోవిడ్ లాక్ డౌన్ తర్వాత భారత్ కు వచ్చిన తొలి ప్రభుత్వాధినేత కూడా ఆమె కావడం విశేషం. మూడు రోజుల పర్యటన కోసం శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సన్..అదే రోజు భారత ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇండో డెన్మార్క్‌ గ్రీన్‌ స్ట్రాటజిక్‌ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇరు దేశాలు గతేడాది గ్రీన్ర్‌స్టాటజిక్‌ ఒప్పందాన్ని చేసుకున్న విషయం తెలిసిందే.

భారత్ లో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు సంబంధించిన సాగు రంగంలో సమర్ధవంతమైన సప్లయ్ చైన్, స్మార్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజిమెంట్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. గ్రీన్‌ టెక్‌పై శ్రద్ధపెడుతున్నందుకు ఈ సందర్భంగా మోదీని.. ఫ్రెడెరిక్‌సెన్‌ ప్రశంసించారు. ఆయన ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. 10 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన నీరు అందించే బృహత్తర లక్ష్యాన్ని మోదీ సర్కార్ నిర్దేశించుకుందన్నారు. డెన్మార్క్​ను సందర్శించేందుకు మోదీ అంగీకరించడం తమకు గర్వకారణం అని డెన్మార్క్ ప్రధాని వ్యాఖ్యానించారు.

డెన్మార్క్‌-భార‌త్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ప‌ర్య‌ట‌న ఓ మైలురాయిగా మిగులుతుంద‌ని ఆమె చెప్పారు. పర్యావరణం– పురోగతి జంటగా ఎలా పయనిస్తాయో తమ భాగస్వామ్యమే ఉదాహరణ అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగం, వాతావరణ మార్పులు, నైపుణాభివృద్ధి వంటి రంగాల్లో మరింత సహకారానికి నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

అయితే, భారతదేశంతో డెన్మార్క్ బలమైన వాణిజ్య , పెట్టుబడి సంబంధాలను కలిగి ఉంది. భారతదేశంలో 200 కంటే ఎక్కువ డానిష్ కంపెనీలు ఉన్నాయి. డెన్మార్క్‌లో 60 కి పైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి. పునరుత్పాదక ఇంధనం, పరిశుభ్రమైన సాంకేతికత, నీరు , వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయం , పశుపోషణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటలైజేషన్, స్మార్ట్ సిటీ, షిప్పింగ్ రంగాలలో ఇరు దేశాల మధ్య బలమైన సహకారం కొనసాగుతోంది.

ALSO READ  7 గంటలు.. 120 భాషలు.. 16ఏళ్ల అమ్మాయి ప్రపంచ రికార్డు