PM Shares Post On Emergency : ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం

ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.

PM Shares Post On Emergency : ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎప్పటికీ మర్చిపోలేం

Pm Modi (4)

PM Shares Post On Emergency ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 1975లో సరిగ్గా ఇదే రోజు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రకటన చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా పిలుచుకునే ఎమర్జెన్సీకి నేటికి 46 ఏళ్లయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. 1975 నుంచి 1977 మధ్య కాలం..వ్యవస్థలను క్రమ పద్దతిలో ఏ విధంగా నాశనం చేశారనే దానికి సాక్ష్యంగా నిలుస్తుందని మోదీ తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్య స్పూర్తిని బలోపేతం చేయడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవించడానికి చేతనైన కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిషేధించిన వాటిని మీరు నమ్మగలరా అంటూ బీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టు లింక్‌ను మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. భారత ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఏ విధంగా తోక్కేసిందో చూడండని విమర్శించారు.ఎమర్జెన్సీని ప్రతిఘటించి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించిన గొప్పవాళ్లందరినీ గుర్తుంచుకుంటామని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

మరోవైపు,స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న గొంతులను నిలువరించడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించారని షా విమర్శించారు. 1975లో సరిగ్గా ఇదే రోజున అధికార స్వార్ధం, అహకారంతో దేశంలో అత్యవసర పరిస్థితులు విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ.. ప్రంపచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని..పెద్ద సంఖ్యలో సత్యాగ్రహులను రాత్రికి రాత్రే జైళ్లలో బంధించారని… ప్రెస్‌ను కూడా లాక్ చేశారని.. ప్రజల ప్రాథమిక హక్కులను హరించి ప్లారమెంట్, కోర్టులను మాట్లాడలేని ప్రేక్షకులుగా మార్చేశారని అమిత్ షా తన ట్వీట్ లో పేర్కొన్నారు. 21 నెలల పాటు క్రూరమైన పాలనలో హింసను అనుభవిస్తూ.. రాజ్యంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడిన దేశవాసులందరి త్యాగానికి నమస్కారం’అని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.