Madhya pradesh : కరోనాతో కొడుకు మృతి..లక్షలాది రూపాయల విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేసిన అత్త‌మామ‌లు

కరోనాతో కొడుకు మృతి చెందాడు. కానీ కోడలికొ కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆ అత్తమామలు ..లక్షలాది విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేశారు.

Madhya pradesh : కరోనాతో కొడుకు మృతి..లక్షలాది రూపాయల విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేసిన అత్త‌మామ‌లు

Daughter In Law Get Married By A Madhya Pradesh Couple

daughter in law get married by a madhya pradesh couple  : అత్తమామలు అంటే కోడలిపాలిట శతృవులు అనే భావన సమాజంలో ఉండిపోయింది. కానీ అత్తమామలు ఓ కోడలి విషయంలో సొంత అమ్మానాన్నలుగా నిలిచారు. కొడుకు చనిపోతే కోడలిని ఎలా వదిలించుకోవాలా అని చూస్తారు కొంతమంది. కానీ వీరు మాత్రం కోడలినే కూతురిగా భావించారు. కరోనాకు కొడుకు బలి అయిపోయినా కోడలిని సొంత కూతురిలా ఆదరించారు. ఓ పక్క కొడుకుని కోల్పోయినా గుండె దిటవు చేసుకున్నారు. కోడలిని అక్కున చేర్చుకున్నారు. సొంత కూతురిలా ఆదరించారు. ఆమెకు ఓ కొత్త జీవితాన్ని అందించారు. కోడలిని కన్నకూతురిలా భావించి లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులు ఇచ్చి మరీ మరో వివాహం జరిపించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన యుగ్ ప్ర‌కాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజ‌ర్. ఈయ‌న‌కు భార్య‌, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి భార్య రీచా, 9 ఏళ్ల కూతురు అన‌న్య తివారీ ఉన్నారు. క‌రోనాతో ప్రియాంక్ తివారీ 2021లో ప్రాణాలు కోల్పోయాడు. అప్ప‌టి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ప్రియాంక్ తివారీ మరణంతో శోక‌సంద్రంలో మునిగిపోయింది. రీచా త‌న భ‌ర్త గురించే ఆలోచిస్తూ మాన‌సికంగా కుంగిపోయింది. కొడుకు మరణంతో కోడలు రిచా రోజు రోజుకు కృంగిపోతుండటానని మామ యుగ్ ప్ర‌కాశ్ గ‌మ‌నించాడు.కోడలికి పదే పదే ధైర్యం చెప్పేవాడు. అయినా రిచా భర్త ఆలోచనలతో వేదన అనుభవిస్తుడేది.కోడలి పరిస్థితిని గమనిస్తున్న యశ్ లో ఓ ఆలోచన వచ్చింది. ఏదోక మాటలు చెప్పి కొడుకుని మరిపించేవారు అత్తమామలు.

ఆమె కొత్త జీవితాన్ని ఇవ్వాలని అప్పుడే ఆమె తిరిగి సాధారణ జీవితం జీవిస్తుంది అని భావించారు. రీచాను అతి బలవంతంగా ఒప్పించి మరో పెళ్లి చేసేందుకు ఒప్పించారు. ఈ క్ర‌మంలో నాగ్‌పూర్‌కు చెందిన వ‌రుణ్ మిశ్రాతో వివాహం కుదిర్చారు.కోడలు రీచాకు ద‌గ్గ‌రుండి అంగ‌రంగ వైభ‌వంగా అక్ష‌య తృతీయ రోజున పెళ్లి చేశారు. ఆమెకు మరో కొత్త జీవితాన్నిచ్చారు. అలా అక్షయ తృతీయ రోజున వివాహం చేసిన కోడలికి యుగ్ ప్ర‌కాశ్ తివారీ దంపతులు గిఫ్టుగా రూ.60 లక్షల రూపాయల విలువైన ఆస్తులు రాసి ఇచ్చారు.

నాగ్‌పూర్‌లో ప్రియాంక్ తివారీ కొన్న రూ.60లక్షల విలువైన ఓ భ‌వ‌నాన్ని రీచాకు బ‌హుమ‌తిగా ఇచ్చారు. రీచా భ‌విష్య‌త్‌లో ఉన్న‌తంగా సంతోషంగా జీవించాలని ఆశీర్వదించి ఆ భ‌వ‌నం రాసిచ్చామ‌ని యుగ్ ప్ర‌కాశ్ దంప‌తులు తెలిపారు. వివాహం అనంత‌రం వ‌రుణ్ మిశ్రాతో క‌లిసి రీచా, కూతురు అన‌న్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడ‌లికి మ‌రో పెళ్లి చేసిన యుగ్ ప్ర‌కాశ్ దంప‌తుల‌పై ప్ర‌శంస‌లు వెలువెత్తుతున్నాయి.