Maharashtra : ఆస్తి కోసం హింసిస్తున్న తండ్రిని.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన కూతురు
రూ.5లక్షలతో కాంట్రాక్టు కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భివాపూర్ లోని సొంత పెట్రోల్ బంక్ లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు కలిసి పొడిచి చంపి పరారయ్యారు.

Man Killed
Man Killed : ఆస్తి కోసం తల్లి, తనను రోజూ గృహ హింసకు గురిచేస్తోన్న తండ్రిని సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో కూతురు చంపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్ పూర్ లో నివాసముండే 60 ఏళ్ల వ్యక్తి ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.
దీంతో తన భార్య పేరున ఉన్న పెట్రోల్ బంక్, ఇల్లు, పొలాన్ని తన పేరు మీద రాయాలంటూ ఆమెను రోజూ హింసించేవాడు. ఇదే విషయంలో మే2వ తేదీన భార్య, కుమార్తె(35)ను కొట్టారు. దీంతో తన తండ్రిని ఎలాగైనా చంపాలని కూతురు నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో రూ.5లక్షలతో కాంట్రాక్టు కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భివాపూర్ లోని సొంత పెట్రోల్ బంక్ లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు కలిసి పొడిచి చంపి పరారయ్యారు. దీంతో నిందితులతోపాటు మహిళను కూడా నాగ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు.