జవాన్లకు రక్షణ కల్పించండి : సుప్రీంలో సైనికుల కూతుర్ల పిటిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2019 / 04:09 PM IST
జవాన్లకు రక్షణ కల్పించండి : సుప్రీంలో సైనికుల కూతుర్ల పిటిషన్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విధుల్లో ఉన్న జవాన్లపై, పోలీసులపై రోజూ ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాదులు రాళ్లు రువ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఉగ్రవాదులు ఆందోళనకారుల ముసుగులో బలగాలపై దాడులకు పాల్పడుతుంటారు. ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తారు. ఈ సమయంలో ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ చేసినప్పుడు అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.  అదే సమయంలో జవాన్లు కూడా గుంపు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం,తీవ్ర గాయాలపాలవడం చూస్తూనే ఉన్నాం. 
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

 ఈ సమయంలో ఇద్దరు ఆర్మీ అధికారుల కూతుర్లు ప్రీతి కేధార్(19), కాజల్ మిశ్రా(20)లు గుంపు దాడులకు పాల్పడుతున్న వారి నుంచి జవాన్లకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.విధుల్లో ఉన్న భధ్రతా సిబ్బందిపై దాడులు జరుగకుండా భధ్రతా సిబ్బంది మానవ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాళ్ల దాడులతో ఆర్మీ సిబ్బంది చాలా భాధలు పడుతున్నారని, శాంతిని నెలకొల్పేందుకు, తాము విధిలు నిర్వహిస్తున్న ప్రాంతంలో రక్షణ కోసం పనిచేస్తున్నారిపై దాడులు తమను తీవ్రంగా కలిచివేశాయని తన పిటిషన్ ఇద్దరు యువతులు విచారం వ్యక్తం చేశారు.
Also Read : గో ఎహెడ్ అంటూ ఆదేశాలు : 30 నిమిషాల్లో కంప్లీట్ : స్వయంగా పర్యవేక్షించిన మోడీ

ఆర్మీ సిబ్బందిపైనే ఎఫ్ఐఆర్ లు నమోదు అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. రాళ్ల దాడికి పాల్పడిన వారికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకున్నట్లయితే..ఆర్మీ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. సోమవారం(ఫిబ్రవరి-25,2019) చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్,జస్టిస్ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించింది. కేంద్రప్రభుత్వానికి, రక్షణమంత్రిత్వ శాఖకు, జమ్మూ కాశ్మీర్ పాలనా విభాగానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read : బోర్డర్ లో హై ఎలర్ట్ : ప్రధాని మోడీ ఎమర్జన్సీ మీటింగ్