David Warner: డేవిడ్ వార్నర్ మళ్లీ మొదలెట్టాడు..! ఈసారి ‘పఠాన్’గా అవతారమెత్తాడు.. వీడియో వైరల్ ..
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తరచూ తన ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ మువీ పఠాన్ సినిమా పాటకు సంబంధించిన వీడియోలో షారూక్ ముఖానికి తన ముఖం మార్పింగ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు వారికి సుపరిచితమే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు తనవంతు కృషిచేశాడు. అయితే, వార్నర్ అంటే క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారికే తెలుసనుకుంటే పొరపాటే. తెలుగు రాష్ట్రాల్లో అధికశాతం మందికి డేవిడ్ వార్నర్ అంటే తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు తీసిన సినిమాల్లో కొన్ని సీన్లను తీసుకొని, ఫేస్ మాస్క్ యాప్ ద్వారా హీరోల ముఖాల స్థానాల్లో తన ముఖం కనిపించేలా చేస్తాడు. ఆ ఫన్నీ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసేవాడు. వార్నర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావటంతో ఆస్ట్రేలియా క్రికెటర్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు.
వార్నర్ ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియోలకు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు టీమిండియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ జట్టులో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. త్వరలో ఇండియా టూర్‌కు రానున్న తరుణంలో వార్నర్ తన ఫన్నీ వీడియోలను మళ్లీ మొదలు పెట్టాడు. ఈ సారి ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ బాద్ షా సినిమా పఠాన్ తో వార్నర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.
View this post on Instagram
పఠాన్ సినిమాలో షారూక్ ఖాన్ ముఖం బదులు తన ముఖాన్ని మార్ఫింగ్ చేసిన ఫన్నీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాల వైరల్ గా మారింది. దీంతో వార్నర్ మళ్లీ మొదలెట్టాడోచ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.