సూటు..టై..గెటప్ అదిరింది: 17ఏళ్ల తర్వాత WEFలో కర్ణాటక సీఎం

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 06:58 AM IST
సూటు..టై..గెటప్ అదిరింది:  17ఏళ్ల తర్వాత WEFలో కర్ణాటక సీఎం

కర్ణాటక సీఎం యడియూరప్ప కొత్త గెటప్ లో కనిపించారు. ఎప్పుడూ వైట్ షర్ట్,వైట్ ఫ్యాంట్ తో కన్పించే ఆయన ప్రస్తుతం దావోస్ లో సరికొత్త గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన సూటు, టై ధరించి బిజెనెస్ మ్యాన్ లుక్ లో కి మారిపోయారు.

ఎప్పుడూ రైతు బిడ్డనని గర్వంగా చెప్పుకునే యడియూరప్ప…ఇప్పుడు వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా చాలా ముఖ్యం అని గ్రహించారు. రైతులు,వ్యవసాయం తన మొదటి ప్రాధాన్యతగా ఎప్పుడూ ఉంటుదన్న యడియూరప్ప పరిశ్రమలు కూడా చాలా ముఖ్యం అని తనకు తెలుసునని యడియూరప్ప అన్నారు. చాలా ఏళ్ల తర్వాత డబ్యూఎఫ్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రెగ్యులర్ గా డబ్యూఈఎఫ్ కు హాజరుఅవుతారనే విషయం తెలిసిందే. అయితే కర్ణాటక నుంచి  17 ఏళ్ల తర్వాత ఓ సీఎం ఇప్పుడు డ్యబూఎఫ్ లో అడుగుపెట్టారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము ఆశక్తి కనబరుస్తున్నామని  తెలుసుకునేందుకు పెట్టుబడిదారులకు డబ్యూఈఎఫ్ వేదిక ఉపయోగపడుతుందని యడియూరప్ప అన్నారు.  బిజినెస్ లో తాము చాలా సీరియస్ అని వాళ్లకు తెలియజేశామని యడియూర్పప అన్నారు. తాను డబ్యూఎఫ్ లో హాజరైన 40పెట్టుబడుల మీటింగ్స్ లో చాలా కంపెనీలు కర్ణాటకలో బిజినెస్ ప్రారంభించేందుకు ఆశక్తికనబర్చినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని అగ్రశేణి వ్యాపార నాయకులతో కర్ణాటకలో పెట్టుబడుల గురించి మాట్లాడినట్లు యడియూరప్ప తెలిపారు. దేశంలోని సీఏఏ నిరసనల గురించి మాట్లాడుతూ వారు రాజకీయంగా ప్రేరేపించబడ్డారన్నారు.