Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్.. అధ్యయనానికి డీసీజీఐ అనుమతి

భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది.

Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్.. అధ్యయనానికి డీసీజీఐ అనుమతి

Vaccine

Vaccine Mixing భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఈ అధ్యయనం నిర్వహించనుంది. ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం..వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడం.

కాగా,జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ ఈ అధ్యయ నిర్వహణకు రికమండ్ చేసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు.. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్‌ల మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఫేజ్ -4 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి వెల్లూర్‌ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని CDSCO నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

READMixing COVID Vaccines : వ్యాక్సిన్ మిక్సింగ్‌.. ఇదో డేంజరస్ ట్రెండ్ : WHO వార్నింగ్!