Sputnik V Vaccine: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాలో తయారుచేసేందుకు సీరంకు అనుమతి

Sputnik V Vaccine: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాలో తయారుచేసేందుకు సీరంకు అనుమతి

Sputnik Sii

Sputnik V Vaccine: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి ఇచ్చింది. రష్యన్ కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీను ఇండియాలో తయారుచేసేందుకు పెట్టుకున్న అప్లికేషన్ కు అనుమతిచ్చింది డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.

పరీక్షించడానికి, టెస్టు చేయడానికి, విశ్లేషణకు కోసం వ్యాక్సిన్ తయారుచేసుకోవచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు అనుమతి వచ్చింది. దీని గురించే సీరం… డీసీజీఐకు అప్లికేషన్ పెట్టుకుంది.

గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయాలజీతో కలిసి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను ఇండియాలో తయారుచేయనుంది సీరం. హెటెరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, పానాసీయా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ లతో పాటు సీరం కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారుచేయనుంది.